Begin typing your search above and press return to search.

హిందీ RX100..ఛాన్స్ రానందుకు కుళ్లుకుంది!

By:  Tupaki Desk   |   10 Nov 2021 3:42 AM GMT
హిందీ RX100..ఛాన్స్ రానందుకు కుళ్లుకుంది!
X
తెలుగు బ్లాక్ బ‌స్ట‌ర్ RX100 అందులో స్టార్ల జీవితాల్ని మార్చిన సంగ‌తి తెలిసిందే. హీరోగా న‌టించిన కార్తికేయ టాలీవుడ్ లో బిజీ స్టార్ గా మారాడు. కోలీవుడ్ లోనూ న‌టించేస్తున్నాడు. ఇక అందాల క‌థానాయిక .. పంజాబీ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ తెలుగులో వ‌రుస అవ‌కాశాలొచ్చాయి.

ఒకే ఒక్క బ్లాక్ బ‌స్ట‌ర్ తో ఈ అమ్మ‌డు ఇన్నేళ్లు ఇక్క‌డ ప‌బ్బంగ‌డిపేయ‌డంలో స‌ఫ‌ల‌మైంది. ఇక్క‌డ హ్యాపెనింగ్ కథానాయికలలో ఒకరిగా వెలుగుతోంది. ప్ర‌స్తుతం బ్లాక్ బస్టర్ హిట్ RX100 హిందీలో రీమేక్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. అక్క‌డ‌ తారా సుతారియా కథానాయికగా నటిస్తోంది. ఇదే విషయం గురించి అడిగినప్పుడు పాయ‌ల్ స్పంద‌న ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. హిందీ రీమేక్ లో నటించనందుకు నిజంగా బాధగా ఉందని పాయల్ చెప్పింది.

తారా కూడా గొప్ప‌గా న‌టిస్తుంద‌ని ప్రోమోలలో ఆమె చాలా అందంగా కనిపించింద‌ని పొగిడేసినా ఏదో ఒక మూల ఆ అవ‌కాశం త‌న‌నే ఎందుకు వ‌రించ‌లేదు! అని కుళ్లుకుపోవడం బ‌య‌ట‌ప‌డింది. రీమేక్ అయినా ఆ సినిమాలో తనని తాను రిపీట్ చేసి ఉండి ఉంటే బావుండేద‌ని అభిప్రాయ‌ప‌డింది. మొత్తానికి త‌న‌లో నిరాశ‌ను దాచుకోలేక‌పోయింది.

తడప్ టైటిల్ తో తెర‌కెక్కుతున్న‌ ఈ చిత్రంలో సునీల్ శెట్టి కొడుకు అహన్ శెట్టి క‌థానాయ‌కుడిగా సినిమా ప్రపంచంలోకి ప్రవేశిస్తుండ‌డంతో దీనిపై అంచ‌నాలేర్ప‌డ్డాయి. ఈ చిత్రానికి మిలన్ లుథ్రియా దర్శకత్వం వహిస్తున్నారు