Begin typing your search above and press return to search.

#పాయ‌ల్‌.. మెల్లిగా ఇంకేదో చూపించాలని ఆత్రం‌!

By:  Tupaki Desk   |   20 March 2021 5:12 AM GMT
#పాయ‌ల్‌.. మెల్లిగా ఇంకేదో చూపించాలని ఆత్రం‌!
X
మెల్లిగా ఏదోలా బ‌తికేయ‌డానికి రాలేదు!.. బిజినెస్ మేన్ మ‌హేష్ డైలాగ్ ఇది‌. ఇక్క‌డ పాయల్ వ్య‌వ‌హారం కూడా ఇంచుమించు అలానే ఉంది. మెల్లిగా ఏదోలా బతికేయ‌డం కుద‌ర‌దు. రంగుల మాయా ప్ర‌పంచంలో పోటీప‌డి స్టార్ డ‌మ్ ని అందిపుచ్చుకోవాలి. అందుకోస‌మే ఈ త‌ప‌న‌.

ఇంత‌కీ పాయ‌ల్ ఏం ప్లాన్ చేసింది? అంటే.. మ‌రీ అంత‌గా విడ‌మ‌ర్చి చెప్పాలా? ఈ ఫోటో చూస్తే మీకే అర్థ‌మ‌వుతుంది. పాయ‌ల్ ఇటీవ‌ల వెబ్ మాధ్య‌మాన్ని షేక్ చేసే కంటెంట్ తో విరుచుకుప‌డుతోంది. పాయ‌ల్ వ‌రుస ఫోటో ట్రీట్ ప్ర‌స్తుతం యువ‌త‌రంలో హాట్ టాపిక్ గా మారుతోంది. ఇక‌ పోటీ లోకంలో పోటీప‌డాలంటే ఏ రేంజులో ప్లాన్ చేయాలో పాయ‌ల్ కి తొలి నుంచి మంచి అవ‌గాహ‌న ఉంది.

ఆర్.ఎక్స్ 100 తో బోల్డ్ బ్యూటీగా ప‌రిచ‌యం అయిన ఈ బ్యూటీ స్టార్ హీరోయిన్ స్టాట‌స్ కోసం చాలానే త‌పించింది. కానీ టూమ‌చ్ బోల్డ్ అంటూ టాలీవుడ్ దూరం పెట్టేయ‌డంతో అటు త‌మిళ ప‌రిశ్ర‌మ వైపు వెబ్ సిరీస్ ల వైపు దృష్టి సారించాల్సి వ‌చ్చింది. అయినా ఇంకా ప‌ట్టువీడ‌ని విక్ర‌మార్కుని సోద‌రిలా తెలుగు సినీప‌రిశ్ర‌మ‌లో పెద్ద కెరీర్ ని ప్లాన్ చేస్తోంద‌ట‌. అందుకే ఇదిగో ఇలా సోష‌ల్ మీడియాల వేదిక‌గా చాలా ప్లాన్ చేస్తోంది. ఆ ప‌సుపు రంగు డిజైన‌ర్ టాప్ దిగువ‌న కుంకుడు కాయంత నాభి కేంద్రాన్ని ఎలివేట్ చేస్తున్న ఫోటో ప్ర‌స్తుతం వైర‌ల్ గా మారింది. పాయ‌ల్ అంద‌చందాల‌కు కుర్ర‌కారు ప‌రేషాన్ అవుతున్నారు. ఇక టాలీవుడ్ కెరీర్ వ‌ర‌కూ అజ‌య్ భూప‌తి పాయ‌ల్ కి మ‌రో అవ‌కాశం ఇచ్చార‌న్న ప్ర‌చారం సాగుతోంది. త‌మిళంలోనూ ఓ చిత్రం‌లో న‌టిస్తోంది.