Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ : ఆరెక్స్ బ్యూటీ పరువాల వల..!

By:  Tupaki Desk   |   24 Nov 2022 5:33 AM GMT
ఫోటో స్టోరీ : ఆరెక్స్ బ్యూటీ పరువాల వల..!
X
బాలీవుడ్ సీరియల్స్ లో నటిస్తున్న పాయల్ ని తను రాసుకున్న కథకు పర్ఫెక్ట్ అనుకున్న అజయ్ భూపతి ఆరెక్స్ 100 సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇప్పించాడు. తెరంగేట్రం తోనే సూపర్ హిట్ అందుకున్న అమ్మడికి టాలీవుడ్ గ్రాండ్ వెల్కం ఇచ్చింది. అయితే తను చేసిన సినిమా ప్రభావం వల్ల అమ్మడికి వరుసగా అలాంటి సినిమాలే వస్తున్నాయట.

అయినా సరే వాటిలో తనకు నచ్చిన కథలు ఓకే చేస్తూ వచ్చింది పాయల్. ఫస్ట్ సినిమా హిట్ తర్వాత కెరీర్ అయితే పుంజుకుంది కానీ ఆరెక్స్ రేంజ్ హిట్ మరో సినిమా అందుకోలేదు. అందుకే పాయల్ తన పంథా మార్చాలని ఫిక్స్ అయ్యింది. ఇక మీదట గ్లామర్ రోల్స్ మాత్రమే కాదు అభినయానికి ప్రాధాన్యత ఉన్న పాత్రలు కూడా చేయాలని అనుకుంటుంది.

సినిమాలతో సంబంధం లేకుండా పాయల్ తన గ్లామర్ షో తో మెప్పిస్తుంది. అమ్మడి లేటెస్ట్ ఫోటో షూట్ కుర్రాళ్లను డిస్టర్బ్ చేస్తుంది. బికినీ టాప్.. కింద ఓ షార్ట్ తో పాయల్ బోల్డ్ లుక్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. పాయల్ వేస్తున్న ఈ పరువాల వలలో ఎంతోమంది చిక్కుకుంటున్నారు. ఆరెక్స్ 100 తర్వాత సినిమాల లెక్క ఎలా ఉన్నా పాయల్ మాత్రం విపరీతమైన క్రేజ్ సంపాదించింది. ఇక అమ్మడి సోషల్ మీడియా ఫాలోవర్స్ గురించి చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం పాయల్ ఇన్ స్టాగ్రాం లో 4 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.

వారందరిని అలరించేలా పాయల్ కొత్త కొత్త ఫోటో షూట్స్ చేస్తుంది. అందులో లేటెస్ట్ ఫోటో షూట్ అయితే ఆమె ఫ్యాన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటోంది. గ్లామర్ ఎటాక్ లో తనను మించిన వారు లేరనేలా పాయల్ చేస్తున్న రచ్చ ఫాలోవర్స్ కి ఐ ఫీస్ట్ అందిస్తుంది. రీసెంట్ గా మంచు విష్ణు సరసన జిన్నా మూవీలో నటించిన పాయల్ ఆ మూవీ డిజాస్టర్ అవడంతో కెరీర్ మరింత రిస్క్ లో పడింది. మరో ఆరెక్స్ లాంటి సినిమా చేయాలని అనుకుంటున్న పాయల్ కి అందుకు తగిన కథ మాత్రం దొరకట్లేదని టాక్. చేస్తున్న సినిమాలేవి బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాలు అందుకోకపోవడంతో ఫోటో షూట్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తుంది పాయల్.

యువ హీరోల సినిమాలు చేస్తూ కెరీర్ కొనసాగిస్తున్న పాయల్ స్టార్ ఛాన్సుల కోసం ఈగర్ గా ఎదురుచూస్తుంది. స్టార్ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసమైనా సరే ఓకే అనేలా ఉన్న పాయల్ అలాంటి ఛాన్స్ ఎప్పుడు అందుకుంటుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.