Begin typing your search above and press return to search.

పాయల్ .. ఎవ‌రీ కొత్త ఫ్రెండు? కుళ్లుకుంటున్నారు!

By:  Tupaki Desk   |   27 March 2021 3:30 PM GMT
పాయల్ .. ఎవ‌రీ కొత్త ఫ్రెండు? కుళ్లుకుంటున్నారు!
X
కెరీర్ ప‌రంగా ఊహించ‌ని డైల‌మాని ఎదుర్కొంటోంది పాయ‌ల్ రాజ్ పుత్. వ‌రుస‌గా నాలుగైదు సినిమాల్లో న‌టించినా ఇటీవ‌ల ఆశించినంత పెద్ద ఆఫ‌ర్లు అయితే లేవు. ఆ క్ర‌మంలోనే ఇరుగు పొరుగు భాష‌ల్లోనూ ప్ర‌య‌త్నాలు ప్రారంభించింది.

మ‌రోవైపు సోష‌ల్ మీడియాల్లో ఈ అమ్మ‌డు మునుప‌టితో పోలిస్తే దూకుడు పెంచేసింది. వ‌రుస‌గా వేడెక్కించే ఫోటోషూట్ల‌ను షేర్ చేస్తూ ఫాలోవ‌ర్స్ ని పెంచుకుంటోంది. ఇంత‌కుముందు త‌న బోయ్ ఫ్రెండ్ తో క‌లిసి ఫోటోషూట్ లో పాల్గొన్న ఫోటోలు వైర‌ల్ అయ్యాయి. ఆ త‌ర్వాత వ‌రుస ఫోటోషూట్ల‌తో పాయ‌ల్ అన్ స్టాప‌బుల్ గా చెల‌రేగుతోంది.

తాజాగా పాయ‌ల్ షేర్ చేసిన ఓ ఫోటో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. పాయ‌ల్ ఎవ‌రినో తెగ ముద్దు చేసేస్తోంది. ఇది చూసిన అభిమానులు.. ఇంత‌కీ ఎవ‌రా కొత్త ఫ్రెండ్? మ‌రీ అంత ముద్దు చేస్తోంది? అంటూ బోయ్స్ ఒక‌టే కామెంట్లు చేస్తున్నారు. సో క్యూట్ ల‌వ్ లీ ఫ్రెండ్ అంటూ ఫ్యాన్స్ కూడా ఈ క్యూట్ ఫ్రెండుని చూసి మురిసిపోతున్నారు. ము‌మా కి జాన్.. మై క్యాండీ క్ర‌ష్‌!! అంటూ తెగ‌ క్ర‌ష్ ఫీల‌వుతున్న పాయ‌ల్ ని చూస్తుంటే ఎంతో ముచ్చ‌ట‌గా క‌నిపిస్తోంది. అలా డెనిమ్ షార్ట్ కి వైట్ ఫ్రాక్ కి మిడిల్ లో అందాల ఎలివేష‌న్ కూడా అంతే హైలైట్ అయిపోతోంది మ‌రి.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. పాయ‌ల్ ప్ర‌స్తుతం అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాకి సంత‌కం చేసింద‌ని ప్ర‌చార‌మ‌వుతోంది. దీనికి అధికారిక ధృవీక‌ర‌ణ లేదు. త‌మిళంలో యాంజెల్ అనే చిత్రంలో న‌టిస్తోంది. ఉద‌య‌నిధి స్టాలిన్ ఈ చిత్రంలో క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్నారు.