Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: ఫ్యాషన్ ఈజ్ మై ప్యాషన్ అంటోందే

By:  Tupaki Desk   |   4 March 2019 5:30 PM GMT
ఫోటో స్టొరీ: ఫ్యాషన్ ఈజ్ మై ప్యాషన్ అంటోందే
X
'RX100' సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన భామ పాయల్ రాజ్ పుత్. మొదటి సినిమాతోనే సంచలన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న పాయల్ అంతటితో ఆగడం లేదు. ఈ జెనరేషన్ బ్యూటీల దారిలోనే హాట్ హాట్ ఫోటోషూట్లు చేస్తూ సోషల్ మీడియాలో ఎప్పుడు సమ్మర్ సీజన్ ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ వేసవిని కంటిన్యూ చేసే క్రమంలోనే ఈమధ్య ఒక ఫోటో పోస్ట్ చేసింది.

ఈ ఫోటో తీసుకున్నది ఆంగ్రియా అనే క్రూజ్ పైన. స్లిట్స్ ఉండే బ్లాక్ డ్రెస్సులో తన థండర్ థైస్ ను చూపిస్తూ ఒక నిచ్చెనను ఆనుకొని స్టైలుగా ఒక చేత్తో తన కురులను సవరించుకుంటూ నిలబడింది. స్మైల్ కూడా అదిపోయింది. ఈ హాట్ ఫోటోషూట్ ఎందుకనుకున్నారు? మిస్సా మోర్ క్లోతింగ్ అనే టెక్స్ టైల్ బ్రాండుకు ఈ పాప అంబాజిడర్. అందుకే ఆ బ్రాండ్ దుస్తులు ధరించి ఫోటోషూట్ లో పాల్గొంది. పైగా ఆన్లైన్లో షాపింగ్ చెయ్యండి.. 15% డిస్కౌంట్ పొందండి అని ఆఫర్ కూడా ఇచ్చింది.

అంతా బాగానే ఉంది కానీ ఈ ఫోటోషూట్ చాలా రోజుల క్రితం జరిగింది. ఈ ఆంగ్రియా క్రూజు.. ఆ నల్ల డ్రెస్ లో తీసుకున్న ఫోటోలను అదేపనిగా వాడుతూ ఉండడంతో "ఒక ఫోటో షూట్ లో ఫోటోలను ఏడాదంతా వాడతావా పాయలూ..కొత్త డ్రెస్సులతో కొత్త ఫోటో షూట్లు చెయ్యి" అంటూ పరాకు ప్రదర్శించాడు ఒక చిరాకు నెటిజనుడు. సదరు నెటిజనుడు చెప్పేది నిజమే కదా.. ఎంత బ్రాండ్ ప్రమోషన్ అయినా ఒకే డ్రస్ లో ఏడాదంతా చేస్తే ఎలా?