Begin typing your search above and press return to search.

హాఫ్ సెంచరీ హీరోలతో ఆరెక్స్ ఇందూ

By:  Tupaki Desk   |   15 May 2019 5:09 AM GMT
హాఫ్ సెంచరీ హీరోలతో ఆరెక్స్ ఇందూ
X
కామం నిండిన ఎక్స్ ప్రెషన్లతో ఓ అమాయకుడిని ప్రేమలో దించి అతని చావుకు కారణం అయ్యే పాత్రలో జీవించిన పాయల్ రాజ్ పుత్ కు ఆరెక్స్ 100 తర్వాత కెరీర్ ఆశించినంత వేగంగా లేదు. కారణం క్రేజీ హీరోల సరసన ఒక్కటంటే ఒక్క ఛాన్స్ రాకపోవడం. ముఖ కవళికల దృష్ట్యా కుర్ర హీరోల సరసన కొంత డిఫరెంట్ గా కనిపించే పాయల్ మీద ఇందూ పాత్ర తాలుకు ప్రభావం కూడా మార్కెట్ మీద పడినట్టు ఉంది.

అది సక్సెస్ అయ్యాక అందరూ అలాంటి పాత్రలే ఆఫర్ చేశారని గతంలో చెప్పుకొచ్చింది. సరే దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకుందాం తరహాలో ప్రస్తుతం పాయల్ వయసుతో నిమిత్తం లేకుండా సీనియర్ హీరోల సరసన సైతం ఓకే చెప్పేస్తోంది ఇప్పటికే వెంకటేష్ తో వెంకీ మామలో చేస్తున్న పాయల్ ఇప్పుడు బాలకృష్ణతో కెఎస్ రవికుమార్ తీయబోయే మూవీలోజోడిగా నటించనుంది.

దీని నిర్మాత సి కళ్యాణ్ ఆరెక్స్ 100 తర్వాత పాయల్ తో ఓ లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్టు తీయాలని ప్లాన్ చేసుకున్నారు. అది ఆలస్యం అవుతుండటంతో ఆ డేట్స్ ని దీనికోసం వాడుకుంటారని తెలిసింది. ఇప్పుడీ ఇద్దరు హీరోలు హాఫ్ సెంచరీ వయసు టచ్ చేసిన వల్లే. మరో సినిమా డిస్కో రాజా హీరో రవితేజ కూడా అటుఇటు ఈ మార్కుకు దగ్గరగా ఉన్నవాడే. ఈ లెక్కన 30 లేదా 35 ఏళ్ళ లోపు హీరోలతో పాయల్ కు జోడి కట్టే ఛాన్స్ వచ్చేలా లేదే