Begin typing your search above and press return to search.

జగన్, నేను డిసెంబర్ లోనే.. : పాయల్ రాజ్ పుత్

By:  Tupaki Desk   |   14 Dec 2020 12:36 PM IST
జగన్, నేను డిసెంబర్ లోనే.. : పాయల్ రాజ్ పుత్
X
టాలీవుడ్ హాట్ బోల్డ్ బ్యూటీగా పాయల్ రాజ్ పుత్ పేరు తెచ్చుకుంది. ఆమె నటించిన సినిమాలన్నింటిలోనూ బోలెడంతా మసాలా ఉంటుంది. అందాలన్నీ తెరపైకి చూపించి యువతను మత్తెక్కించే ఈ అమ్మడు తాజాగా ఏపీలో పర్యటించింది. ఈ సందర్భంగా జగన్ పై హాట్ కామెంట్స్ చేసింది.

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల క్రీడా మైదానంలో ప్రీమియర్ లీగ్ సీజన్4 క్రికెట్ పోటీలను ఆదివారం మంత్రి అనిల్ కుమార్, ఎంపీ భరత్ తో కలిసి హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె ఏపీ సీఎం జగన్ పై తెలుగులో మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచారు.

పాయల్ మాట్లాడుతూ.. ‘స్టార్స్ అందరూ డిసెంబర్ నెలలోనే పుడుతారని.. మన డైనమిక్ సీఎం జగన్ తోపాటు నేను కూడా డిసెంబర్ లోనే పుట్టాను.’ అని అన్నారు. కాలేజీ రోజుల్లో క్రికెట్ ఆడేదానిని అని.. తనకు క్రికెట్ అంటే చాలా ఇష్టం అని పాయల్ తెలిపారు.

ఈ సందర్భంగా రాజమండ్రి రావడం తనకు సంతోషంగా ఉందని.. ఇక్కడి గోదావరి అందాలు చాలా బాగుంటాయని పాయల్ అన్నారు.