Begin typing your search above and press return to search.

అసలే ఆఫర్‌ లేవంటే పాయల్‌ కు మరో కష్టం

By:  Tupaki Desk   |   18 Sept 2020 9:00 AM IST
అసలే ఆఫర్‌ లేవంటే పాయల్‌ కు మరో కష్టం
X
ఆర్‌ ఎక్స్‌ 100 సినిమాతో హీరోయిన్‌ గా ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన ముద్దుగుమ్మ పాయల్‌ రాజ్‌ పూత్‌. నెగటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో నటించడం వల్ల అమ్మడికి మంచి గుర్తింపు అయితే దక్కింది. ఆ తర్వాత వరుసగా సినిమాల్లో ఆఫర్లు వచ్చాయి కాని స్టార్‌ డం తెచ్చి పెట్టే పాత్ర కాని సినిమా కాని ఈమెకు దక్కలేదు. ఇంకా కూడా ఆర్‌ ఎక్స్‌ 100 బ్యూటీ అంటూనే ఈమెను పిలుస్తున్నారు తప్ప ఆ తర్వాత వచ్చిన సినిమాల్లో ఏ ఒక్క పాత్రతో అయినా ఈమెను గుర్తించలేని పరిస్థితి. టాలీవుడ్‌ లో నిలదొక్కుకునేందుకు ఈమె చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. ఇలాంటి సమయంలో ఈమెకు మరో సమస్య వచ్చిందట.

హీరోయిన్స్‌ అంటే తెలుగు ప్రేక్షకులకు సన్నగా నాజూకుగా ఉండాలి. కాని పాయల్‌ మాత్రం ఈ లాక్‌ డౌన్‌ లో ఇంట్లో ఉండి వర్కౌట్స్‌ ను మర్చి పోవడంతో ఏకంగా 62 కేజీల బరువు పెరిగిందట. ఈమద్య కాలంలో కాస్త కష్టపడి 58.5 కేజీలకు వచ్చిందట. మునుపటి వెయిట్‌ కు రావాలని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది. 52 కేజీలకు వచ్చే వరకు తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉంటాను అంది. బరువు పెరిగానంటూ బాహాటంగా చెప్పడంతో ఈ అమ్మడి గురించి మేకర్స్‌ ఆలోచించడం మానేస్తారేమో అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. త్వరగా బరువు తగ్గి మళ్లీ మునుపటి జోష్‌ తో ముందుకు వస్తే బాగుంటుందని అంటున్నారు.