Begin typing your search above and press return to search.
సామ్ కి పెద్ద ఫ్యాన్ ని అంటూ బిస్కెట్ వేసింది!
By: Tupaki Desk | 26 Oct 2020 9:40 PM ISTబిగ్ బాస్ సీజన్ 4 ఈ ఆదివారం 50 ఎపిసోడ్ పూర్తి చేసుకుంది. ఈ షోకి కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఆయన నటిస్తున్న `వైల్డ్‌డాగ్` షూటింగ్ హిమాలయాల్లో జరుగుతోంది. ఈ సందర్భంగా బిగ్ బాస్ సీజన్ 4ని పక్కన పెట్టేసి నాగ్ ఈ మూవీ షూటింగ్ కోసం కులు మనాలి వెళ్లిపోయారు. దీంతో ఈ వీకెండ్ హోస్ట్ ఎవరు అనే ఉత్కంఠ కొనసాగింది.
సడెన్ సర్ ప్రైజ్ అన్నట్టుగా సండేకి మామ నాగ్ స్థానంలో సమంత హోస్ట్ గా ఎంట్రీ ఇచ్చింది. దసరా ఎపిసోడ్ ని సరదాగా సాగించాలని స్పెషల్ గెస్ట్ లని కూడా ఏర్పాటు చేశారు. హైపర్ ఆది డిటెక్టివ్ గా వచ్చేస్తే .. `Rx 100` కార్తికేయ.. పాయల్ రాజ్ పుత్ గెస్ట్ ఎంట్రీ ఇచ్చారు. షో ఆసాంతం రసవత్తరంగా సాగుతుండగా పాయల్ ఎంట్రీ ఇచ్చింది. ఓ పాటకు చిందులేసింది కూడా.
ఆ తరువాత పాయల్ ని మళ్లీ హైపర్ ఆది రావడంతో స్టేజ్ పైకి సమంత ఆహ్వానించింది. మరోసారి స్టేజ్ పైకి వచ్చిన పాయల్ క్రేజీ హీరోయిన్ సమంతతో కలిసి స్టేజ్ ని పంచుకోవడం గర్వంగా వుందిని..., తనకు పెద్ద ఫ్యాన్ ని అని సామ్ ని ఐస్ చేసే ప్రయత్నం చేసింది. అయితే పాయల్ కి ఇవ్వాల్సిన ప్రియారిటీ బిగ్ బాస్ నిర్వాహకులు ఇచ్చినట్టుగా కనిపించలేదు. తను కేవలం గెస్ట్ మాత్రమే .. అంతా సామ్ వన్ మెన్ షోలా కనిపించింది. ఇంతకీ పాయల్ ని నిర్వాహకులు ఎందుకు పిలిచారో వారికైనా క్లారిటీ వుందా? అని అంతా కామెంట్ చేస్తున్నారు.