Begin typing your search above and press return to search.

ఆరెక్స్ పాపది మామూలు డెడికేషన్ కాదు!

By:  Tupaki Desk   |   16 April 2020 12:40 PM IST
ఆరెక్స్ పాపది మామూలు డెడికేషన్ కాదు!
X
పాయల్ రాజ్ పుత్ చేసింది తక్కువ సినిమాలే అయినా ప్రతి సినిమాకు తనవంతుగా ప్రమోషన్ మాత్రం గట్టిగా చేస్తూ ఉంటుంది. రిలీజ్ కు ముందు.. రిలీజ్ తర్వాత వారం రోజులు ప్రమోషన్ చేయడం సాధారణమే. కానీ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్న సినిమాలకు ప్రచారం చేయడం మాత్రం కొత్త విషయం. తాజాగా పాయల్ ఇలాగే తను నటించిన సినిమాకు ప్రచారం చేస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది.

ప్రస్తుతం ప్రేక్షకులందరూ ఓటీటీ ప్లాట్ ఫామ్ లపై పడ్డారు. కొత్త సినిమాలు.. వెబ్ సిరీస్ లతో టైం పాస్ చేస్తున్నారు. ఈమధ్య మాస్ మహారాజా రవితేజ -పాయల్ రాజ్ పుత్ జంటగా నటించిన 'డిస్కో రాజా' చిత్రం సన్ నెక్స్ట్ లోకి అందుబాటులోకి వచ్చింది. 'డిస్కో రాజా' బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అయినప్పటికీ ఈ సినిమాను ఓటీటీ ప్రేక్షకులకు చేరువ చేయాలని పాయల్ గట్టిగా ఫిక్స్ అయినట్టుంది. అందుకే 'డిస్కో రాజా' సన్ నెక్స్ట్ లో స్ట్రీమ్ అవుతూ ఉంటే పాయల్ దానికి తగ్గట్టే ఎక్స్ ప్రెషన్స్ ఇస్తూ ఒక వీడియో షూట్ చేసింది. ఆ వీడియోను తన సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేసింది.ఈ వీడియోకు నెటిజన్లు తెగ కామెంట్లు పెడుతున్నారు.

డిజాస్టర్ సినిమాకు ప్రచారం ఏంటని కొందరు విమర్శిస్తుంటే.. కొందరేమో ఆ సినిమా డిజాస్టర్ అయితేనే ఈ రకంగా ప్రచారం చేస్తోంది.. ఒకవేళ హిట్ అయి ఉంటే ఆ ప్రచారం తారాస్థాయిలో ఉండేదని వ్యాఖ్యానిస్తున్నారు. క్వారంటైన్ కారణంగా ఇంట్లోనే ఉన్న పాయల్ 2 రోజుల క్రితం తడిబట్టతో ఫ్లోర్ క్లీనింగ్ చేస్తూ ఒక ఫోటోను తన ట్విటర్ ఖాతా ద్వారా షేర్ చేసింది. ఈరోజు ఏమో 'డిస్కో రాజా' ప్రమోషన్స్ చేపట్టింది.. పాయల్ వరస చూస్తుంటే తన సినిమాలన్నింటికీ గట్టి ప్రచారం చేసి ఓటీటీ వ్యూస్ పెంచాలని కంకణం కట్టుకున్నట్టుగా ఉంది.