Begin typing your search above and press return to search.

అందాల విందుకు సిద్ధంకండి అంటున్న పాయల్ ఘోష్..

By:  Tupaki Desk   |   14 March 2020 3:30 AM GMT
అందాల విందుకు సిద్ధంకండి అంటున్న పాయల్ ఘోష్..
X
పాయల్ ఘోష్. పదేళ్ల క్రితం ప్రయాణం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ సినిమాతో ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. అప్పుడామెకు 20 సంవత్సరాలు. రీసెంట్ గా పాయల్ 'కోయి జానేనా' సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. అంతకుముందు తెలుగులో ఊసరవెల్లి సినిమాలో కన్పించినా పెద్దగా ఫేట్ ఏమి మారలేదు.

ఈ మధ్యే FHM మ్యాగజైన్ ఫోటో షూట్ కోసం హాట్ గా అందాలను ఆరబోసింది. అంతే సోషల్ మీడియా మొత్తం తన హాట్ ఫోజులతో హీటెక్కిస్తోంది. ప్రస్తుతం పాయల్ అందాల విందే.. ట్రెండింగ్ లో ఉంది. ప్రతి పోజులో ఆకర్షణీయమైన బాడీ స్ట్రక్చర్ తో - లేలేత పూరేకుల్లాంటి అధరాలతో, ప్రతి ఫ్రేమ్ లో నాజుకుతనంతో బి-టౌన్ మొత్తం షేక్ చేస్తుంది. ఇప్పుడు పాయల్ ఏ పోజిచ్చినా సోషల్ మీడియాలో సంచలనంగా మారుతున్నాయి.

ఇకనుండి పాయల్ కూడా సినీ ఇండస్ట్రీని ఏలనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇలా హాట్ ఫోజులతో తన కెరీర్ వేగం పెంచుకోవడానికి ప్రయత్నిస్తుందని మరికొందరు గుసగుసలాడుతున్నారు. ఏదేమైనా అభిమానులకు సొగసుల విందును వండి వడ్డిస్తూ ఉంది పాయల్ ఘోష్.