Begin typing your search above and press return to search.

వై-కేటగిరి భద్రత కోరుతూ ప్రభుత్వానికి నటి లేఖ

By:  Tupaki Desk   |   5 Oct 2020 10:30 PM IST
వై-కేటగిరి భద్రత కోరుతూ ప్రభుత్వానికి నటి లేఖ
X
బాలీవుడ్ లో మీటూ పేరుతో నటీమణులు తమకు ఎదురైన లైంగిక ఇబ్బందుల గురించి ఎలుగెత్తి చాటుతున్నారు. ఈ క్రమంలోనే చాలామంది జాతకాలు బయటపడుతున్నాయి.ఇటీవల ప్రముఖ దర్శకుడు, చిత్రనిర్మాత అనురాగ్ కశ్యప్ పై తీవ్రమైన లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది నటి పాయల్ ఘోష్. ఈ క్రమంలోనే తన న్యాయవాది ద్వారా వై-కేటగిరి భద్రత కోరుతూ మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ కు లేఖ రాయడం సంచలనమైంది.

పాయల్ ఘెష్ యొక్క న్యాయవాది నితిన్ సాట్పుట్ సోమవారం ఈ మేరకు ట్విట్టర్ ఖాతాలో ఈ లేఖను పంచుకున్నారు, ఇందులో నిందితుడు "స్వేచ్ఛగా తిరుగుతున్నాడు" ఇంకా అరెస్టు చేయబడలేదు అని పాయల్ ఘోష్ పేరుతో రాసిన లేఖ సంచలనమైంది. అందులోనే నిందితుడు తనకు హాని కలిగించవచ్చని, తన జీవితం ప్రమాదంలో ఉందని నటి పేర్కొనడం దుమారం రేపింది..

లేఖలో న్యాయవాది సాట్‌పుట్ "ఈ రోజు 5/10/2020న పాయల్ ఘోష్ భద్రత కోసం న్యాయవాది నితిన్ ద్వారా మహారాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తున్నట్టు" ఆ లేఖలో పేర్కొన్నారు. మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషారీతో జరిగిన సమావేశంలో తనకు వై-కేటగిరీ భద్రత కల్పించాలని ఇటీవల పాయల్ డిమాండ్ కూడా చేశారు.

కాగా నటి పాయల్ ఘోష్ చేసిన అన్ని ఆరోపణలను దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఖండించారు. అయితే దర్శకుడు కశ్యప్ పోలీసుల ముందు అబద్దం చెప్పాడని పాయల్ ఆరోపించింది. ఆయనకు నార్కో ఎనాలిసిస్, లైడిటెక్టర్, పాలిగ్రాఫ్ టెస్ట్ కూడా చేయాలని నటి ఆరోపించడం బాలీవుడ్ లో దుమారం రేపింది.