Begin typing your search above and press return to search.

కరోనాతో హీరోయిన్‌ కు ఆర్థిక దెబ్బ

By:  Tupaki Desk   |   18 April 2020 11:40 AM IST
కరోనాతో హీరోయిన్‌ కు ఆర్థిక దెబ్బ
X
కరోనా అనేది ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అందరి పై ప్రభావం చూపిస్తూనే ఉంది. ఏదో ఒక రకంగా చిన్నా పెద్దా అందరిని కూడా కరోనా వైరస్‌ ప్రభావితం చేసింది.. చేస్తూనే ఉంది. ఇక ఇండియాలో లాక్‌ డౌన్‌ కారణంగా కోట్లాది మంది తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న విషయం తెల్సిందే. వ్యాపారస్తులు వందల వేల కోట్ల రూపాయలను నష్టపోతూ ఉంటే.. పేదవారు తిండి లేక అవస్థలు పడుతున్నారు. ఇలాంటి సమయంలో సెలబ్రెటీలకు కూడా తిప్పలు తప్పడం లేదు. ఎప్పుడు బిజీగా ఉండే స్టార్స్‌ ఇప్పుడు ఇంటికే పరిమితం అవ్వడంతో వారికి కూడా ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయట.

తాజాగా ఈ విషయాన్ని హీరోయిన్‌ పాయల్‌ ఘోష్‌ తన సోషల్‌ మీడియాలో పేర్కొంది. ఈ సమయంలో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులకు ప్రతి ఒక్కరు గురవుతున్నారంది. తనకు కూడా ప్రయాణాలు లేవు.. పని లేదు.. జీవితంలో కష్టమైన రోజులు నడుస్తున్నాయి. ఆర్థికంగా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నాం. ఇలాంటి ఒక జీవితంను ఎదుర్కోవాల్సి వస్తుందని కనీసం కలలో కూడా తాను భావించలేదంటూ తన ఆర్థిక కష్టాలను అమ్మడు ఏకరువు పెట్టింది.

తెలుగులో ఈ అమ్మడు మంచు మనోజ్‌ నటించిన ప్రయాణం చిత్రంతో గుర్తింపు దక్కించుకుంది. కాని ఆ తర్వాత ఈమె సినిమాలు పెద్దగా ఆడలేదు. ఎన్టీఆర్‌ ఊసరవెల్లి సినిమాలో ముఖ్య పాత్రలో నటించినా అది కూడా ఆమెకు ఆఫర్లు తెచ్చి పెట్టలేక పోయింది. ప్రస్తుతం ఈ అమ్మడు మోడలింగ్‌ చేస్తూ ఆఫర్ల కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంది.