Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ అవ‌య‌వ‌దానం చేయాల‌న్న‌ న‌టి

By:  Tupaki Desk   |   18 July 2020 9:30 AM GMT
ఎన్టీఆర్ అవ‌య‌వ‌దానం చేయాల‌న్న‌ న‌టి
X
నేను సైతం అంటూ మంచికి నేనున్నాను అంటారు జూ.ఎన్టీఆర్. అన్నివేళ‌లా అత‌డిలో ప‌రిణ‌తితో కూడుకున్న‌ పాజిటివిటీ అంద‌రిలో ఎన‌ర్జీ నింపుతుంది. ఫ్యాన్స్ ఈ విష‌యంలో ఎప్పుడూ హ్యాపీనే. ప్ర‌స్తుతం ఆర్.ఆర్.ఆర్ చిత్రీక‌ర‌ణ వాయిదా ప‌డినా ఇంకా ఎంతో ఓపిగ్గా వెయిట్ చేస్తూ స్ఫూర్తి నింపుతున్నాడు. అలాంటి స్టార్ కి స్ఫూర్తి నింపే ఛాలెంజ్ నే విసిరింది ఆయ‌న స‌ర‌స‌న ఆడిపాడిన‌ ఎక్స్ హీరోయిన్.

తార‌క్ స‌ర‌స‌న ఊస‌ర‌వెల్లి చిత్రంలో న‌టించిన పాయ‌ల్ ఘోష్‌ గుర్తుంది క‌దా? ఆ సినిమా 2011లో రిలీజైంది. ఆ త‌ర్వాత ఎన్టీఆర్ కి ఈ అమ్మ‌డు వీరాభిమాని అయిపోయాన‌ని చెప్పింది. పాయల్ ఇంత‌కుముందు ట్విట్టర్ ‌లో అవయవాలను దానం చేస్తున్నాన‌ని ప్ర‌క‌టించి అంద‌రిలో స్ఫూర్తి నింపింది. నేడు తాజాగా మ‌రోసారి ట్విట్ట‌ర్ లో ఛాలెంజ్ విసిరింది. అది కూడా ఎన్టీఆర్ ని ఆహ్వానించింది.

తన అవయవాలను దానం చేస్తానని ప్రతిజ్ఞ చేయాల్సిందిగా ఎన్టీఆర్ ని పాయ‌ల్ కోరింది. ``లక్షలాది మందికి ఒక రోల్ మోడల్ గా ముందుకు వచ్చి తార‌క్ ఈ ప్రయత్నానికి మద్దతు ఇవ్వగలిగితే.. సమాజం జీవించడానికి మంచి ప్రదేశంగా మారడానికి ఇది సహాయపడుతుంది`` అని పాయల్ ట్వీట్ చేసింది. తార‌క్ స‌ద‌రు భామ అభ్య‌ర్థ‌న‌ను మ‌న్నించి ఈ ఛాలెంజ్ ని స్వీక‌రిస్తాడా లేదా? అన్న‌ది వేచి చూడాలి.