Begin typing your search above and press return to search.
పాయల్ ఆశ నెరవేరిందట
By: Tupaki Desk | 12 Sept 2020 11:00 PM ISTఆర్‌ఎక్స్ 100 సినిమాతో పాయల్ రాజ్ పూత్ అనూహ్య స్టార్ డం దక్కించుకుంది. ఆ సినిమాలో అందాలు ఆరబోయడంతో పాటు నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించడంతో ఆమె నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆ వెంటనే ఆమెకు భారీగానే ఆఫర్లు వచ్చాయి. అయితే ఆమె తీసుకున్న నిర్ణయాల వల్లో లేదంటే మరేమో కాని ఆశించిన స్థాయిలో మాత్రం స్టార్ డం దక్కలేదు. ఇప్పటికి పాయల్ అంటే ఆర్ ఎక్స్ 100 సినిమానే గుర్తుకు వస్తుంది తప్ప ఆ తర్వాత చేసిన సినిమాలు ఏమీ గుర్తుకు రావడం లేదు. మరో మంచి పాత్ర కోసం పాయల్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది.
గతంలో పలు ఇంటర్వ్యూలో పాయల్ మాట్లాడుతూ నాకు తెలుగు బాగానే మాట్లాడటం వస్తుంది. కనుక ఎప్పుడెప్పుడు డబ్బింగ్ చెప్పుకుంటానా అంటూ ఎదురు చూస్తున్నాను అంది. ఎట్టకేలకు ఆమెకు తాజా సినిమాకు డబ్బింగ్ చెప్పే అవకాశం దక్కింది. జయంత్ సీ పరాన్జీ దర్శకత్వంలో రూపొందుతున్న ఓ ఇండో పాక్ బోర్డర్ కథలో ఈమె నటిస్తోంది. ఆ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అవ్వడంతో పాయల్ తన పాత్రకు డబ్బింగ్ చెప్పుకుంది. అందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
మిషన్ కంప్లీటెడ్.. మొదటి సారి తెలుగులో డబ్బింగ్ చెప్పానంటూ ఆనందంగా డబ్బింగ్ స్టూడియో ఫొటోలను షేర్ చేసింది. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ సినిమాలో పాయల్ పాత్ర ఏంటీ అనే విషయంలో కూడా ఇంకా క్లారిటీ రాలేదు. ఈ సినిమాతో పాటు పాయల్ మరికొన్ని సినిమాలను కూడా చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.