Begin typing your search above and press return to search.

అమ్మడి పరిస్థితి క్రాస్ రోడ్స్ లో నిలుచున్నట్లుందట!

By:  Tupaki Desk   |   9 Feb 2020 10:00 PM IST
అమ్మడి పరిస్థితి క్రాస్ రోడ్స్ లో నిలుచున్నట్లుందట!
X
మత్తెక్కించే కళ్లు.. చూపులతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేసే భామల్లో పాయల్ రాజ్ పుత్ ఒకరు. ఆర్ఎక్స్ 100తో ఒక్కసారి స్టార్ హీరోయిన్ స్టేటస్ సొంతం చేసుకున్నా.. తనకొచ్చిన ఇమేజ్ తో చిత్రాల ఎంపికలో అమ్మడు తప్పటడుగులు వేసింది. ఆ తర్వాత చేసిన ఆర్ డీఎక్స్ లవ్ దారుణ ప్లాప్ కావటంతో ఆమె పరిస్థితి అర్థం కానిదిగా మారింది.

దీపం వెలుగుతున్నప్పుడు ఇంటిని చక్కదిద్దుకోవాలన్న రూల్ ను మరిచి.. తనకొచ్చిన ఇమేజ్ తో భారీ ఛాన్సుల కోసం వెయిట్ చేసి.. చివరకు వెంకీ మామలో చేసింది. ఈ సినిమాతో తన సుడి తిరిగిపోతుందని భావించినా.. సీనియర్ నటుడితో జత కట్టటం ద్వారా భారీ తప్పు చేసిందన్న వాదన వినిపించింది. ఇప్పుడు అందుకు తగ్గట్లే ఆమె పరిస్థితి ఉందట.

వెంకీమామలో పాయల్ కు పెద్దగా పేరు వచ్చింది లేదు. దీంతో నమ్ముకున్న సినిమా నట్టేట ముంచినట్లుగా ఫీల్ అవుతుందట. మొదట్లో వచ్చిన అవకాశాల్ని.. ఎంపిక పేరుతో చేజార్చుకున్న ఈ హాట్ భామకు ఇప్పటికి డిమాండ్ ఉంది కానీ.. దాని వల్ల ఎలాంటి ప్రయోజనం లేదంటున్నారు.

పెద్ద సినిమాల్లో అవకాశాలు వస్తున్నప్పటికీ.. అమ్మడికి వస్తున్నవన్నీ చిన్న పాత్రలేనని చెబుతున్నారు. దీంతో.. ఆమె ప్రస్తుత పరిస్థితి క్రాస్ రోడ్ లో నిలుచున్నట్లుగా ఉందంటున్నారు. అవకాశాలు ఉన్నా.. పాత్రల పరిధి చిన్నది కావటంతో దిగులుపడిపోతుందట. మార్కెట్ మరింత డ్యామేజ్ అయ్యేలోపు.. అర్జెంట్ గా కుర్ర పిల్ల ఇమేజ్ తెచ్చుకుంటే తప్ప.. పాయల్ కెరీర్ ఒక గాటున పడేలా లేదన్న మాట వినిపిస్తోంది.