Begin typing your search above and press return to search.

ఎట్ట‌కేల‌కు పూజాను లాక్ చేసిన గురుడు

By:  Tupaki Desk   |   8 Nov 2021 7:00 AM IST
ఎట్ట‌కేల‌కు పూజాను లాక్ చేసిన గురుడు
X
మూడు ప‌రిశ్ర‌మ‌ల్లో బిజీ నాయిక‌గా వెలిగిపోతోంది పూజా హెగ్డే. తెలుగు-త‌మిళం-హిందీలో వ‌రుస ప్రాజెక్టుల‌కు క‌మిటైన సంగ‌తి తెలిసిందే. విజయ్ బీస్ట్ - మహేష్ బాబు - త్రివిక్రమ్ చిత్రం.. సల్మాన్ ఖాన్ తో భారీ చిత్రం.. ఇవ‌న్నీ పూర్తి చేయాల్సి ఉంది. ఇంత‌లోనే మ‌రో గుడ్ న్యూస్ తో వ‌చ్చింది పూజా.

గ‌త కొంత‌కాలంగా పవన్ కళ్యాణ్ కి హీరోయిన్ గా బుట్ట‌బొమ్మ‌ పూజా హెగ్డే న‌టిస్తోంద‌ని టాలీవుడ్ స‌ర్కిల్స్ లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్ త‌ర్వాత మ‌రోసారి పూజాని లాక్ చేసేందుకు హ‌రీష్ శంక‌ర్ మంత‌నాలు సాగిస్తున్నార‌ని గుస‌గుస‌లు వినిపించాయి. తాజాగా ఇదే విషయాన్ని దర్శకుడు హరీష్ శంకర్ స్వయంగా ఓ సినిమా ఫంక్షన్ లో ప్రకటించారు. తన కొత్త చిత్రం భవదీయుడు భగత్ సింగ్ లో ఆమె పవన్ కళ్యాణ్ స‌ర‌స‌న న‌టిస్తుంద‌ని తెలిపాడు. పూజా హెగ్డే ఓకే చెప్పింది కాబ‌ట్టి.. ఇక‌ ప్రాజెక్ట్ ప్రారంభం ఎప్పుడు అన్న‌ది వేచి చూడాల్సి ఉంది.

పవన్ కళ్యాణ్ వ‌రుస చిత్రాల్లో న‌టిస్తూనే రాజకీయంగా బిజీ అవుతున్నారు. ఆ క్ర‌మంలోనే కొత్త ప్రాజెక్టుల విష‌యంలో సందిగ్ధ‌త నెల‌కొంది. పూజా ఇంకా సంత‌కం చేయాలంటే క‌న్ఫ‌ర్మేష‌న్ చెప్పాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ పై సంతకం చేసే ముందు హరీష్ శంకర్ నుండి క్లారిటీ కోసం త‌ను వేచి చూస్తోంది. రెండు నెల‌ల్లో పూజాకు కాల్షీట్ల ప‌రంగా వెసులుబాటు ల‌భిస్తుంది. అప్ప‌టికి ఏదో ఒక‌టి క‌న్ఫామ్ కానుంద‌ని తెలిసింది.