Begin typing your search above and press return to search.

లైకుల కోసం పవన్ ఫ్యాన్స్ ను తిడుతున్నాడు

By:  Tupaki Desk   |   8 May 2018 12:02 PM IST
లైకుల కోసం పవన్ ఫ్యాన్స్ ను తిడుతున్నాడు
X
రాంగోపాల్ వర్మ ఓ మాంచి సినిమా తీశా అంటున్నాడు.. అఫ్ కోర్స్ అనుకుంటున్నాడు. ఆఫీసర్ అంటూ నాగార్జునతో తెరకెక్కించిన ఈ సినిమా అంత సత్తా ఉన్న మూవీనో కాదో తెలియాలంటే.. ముందు రిలీజ్ వరకూ కథ నడవాల్సి ఉంది. ఇంకా బిజినెస్ వ్యవహారాలు కూడా జరగలేదనే టాక్ ఉంది.

మొదట ఓ టీజర్ ఇచ్చాడు. దాన్ని జనాలు పట్టించుకోలేదు. రీసెంట్ గా రెండో టీజర్ కూడా ఇచ్చాడు. మొదటి దాని కంటే ఇది మరీ ఘోరంగా ఉందనే మాటలు వినిపించాయి. అసలు నాగార్జునతో వర్మ సినిమా అనగానే ముందే అభిమానులకు ఆశలు లేవు. ఆ మధ్యలో శ్రీరెడ్డి వ్యవహారంలో తలదూర్చి.. మరింతగా తనను ఎవరూ పట్టించుకోవాల్సిన అవసరం లేని స్థితి తెచ్చుకున్నాడు. ఇప్పటికిప్పుడు వర్మ టార్గెట్.. ఆఫీసర్ కు ఎలాగైనా బజ్ పెంచడం.

మరి సడెన్ గా క్రేజ్ రావాలంటే ఏం చేయాలి? దీనికి సమాధానం పెద్ద కష్టమేం కాదు.. ఎందుకంటే వర్మ ఇప్పటికే శ్రీరెడ్డికి ఈ విషయంలో గొప్ప సలహా ఇచ్చాడు. పవన్ ను తిడితే పనయిపోతుందంతే అన్నది తన సజెషనే అంటూ వర్మ.. స్వయంగా చెప్పాడు. ఇప్పుడు ఆఫీసర్ కోసం కూడా ఇదే టెక్నిక్ పాటిస్తున్నాడు. ఈయన రీసెంట్ గా విడుదల చేసిన టీజర్ కు కేవలం 11వేల డిజ్ లైకులు మాత్రమే వచ్చాయట. కేవలం 11వేలే డిజ్ లైక్స్ వచ్చాయంటే.. ఇన్ని కోట్ల మంది జనాభాలో పవన్ ఫ్యాన్స్ 11వేలేనా అంటూ.. పవన్ అభిమానులను గిల్లుతున్నాడు. తిడుతున్నాడు.

ఇలాగైనా వారిని రెచ్చగొట్టి.. దీనికి వ్యూస్ పెంచాలన్నది వర్మ ఐడియా. పవన్ ను.. పవర్ స్టార్ ఫ్యాన్స్ రెచ్చగొట్టేందుకు ట్రై చేస్తున్నాడు. సేమ్ ఇలాంటి ఐడియానే శ్రీరెడ్డికి ఇచ్చి.. ఆమె ఉద్యమాన్ని భ్రష్టుపట్టించిన వర్మ.. ఇప్పుడు ఆఫీసర్ కు కూడా అదే ఆలోచన అప్లై చేస్తూ ఏం సాధించదలచుకున్నాడో? వర్మ లాంటి దర్శకుడు ఇలా అయిపోయాడేంటో?