Begin typing your search above and press return to search.

గురూజీ కోసం స్పెష‌ల్ ప్యాకేజ్ అడుగుతున్నాడా?

By:  Tupaki Desk   |   9 April 2022 5:00 AM IST
గురూజీ కోసం స్పెష‌ల్ ప్యాకేజ్ అడుగుతున్నాడా?
X
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ కల్యాణ్ సినిమా అంటే స్టార్ డైరెక్ట‌ర్ మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ పేరు ప్ర‌ముఖంగా వినిపించ‌డం ఆనవాయితీగా మారింది. రాజ‌కీయాల కార‌ణంగా దాదాపు మూడున్న‌రేళ్ల విరామం త‌రువాత ప‌వన్ క‌ల్యాణ్ మ‌ళ్లీ సినిమాల్లో న‌టించ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. ఈ స‌మ‌యంలో బాలీవుడ్ హిట్ ఫిల్మ్ `పింక్‌` రీమేక్ లో న‌టించ‌మ‌ని త్రివిక్ర‌మ్ స‌ల‌హా ఇచ్చార‌ట‌. దీంతో ప‌వ‌న్ `పింక్‌` ఆధారంగా రూపొందిన `వ‌కీల్ సాబ్‌` సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు.

అక్క‌డి నుంచే ప‌వ‌న్ సినిమాల‌లో త్రివిక్ర‌మ్ ఇన్ వాల్వ్ కావ‌డం మొద‌లైంది. ఇటీవ‌ల ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన మ‌రో రీమేక్ `భీమ్లా నాయ‌క్‌`. ఈ చిత్రాన్ని మ‌ల‌యాళ సూప‌ర్ హిట్ ఫిల్మ్ `అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్‌` ఆధారంగా తెర‌కెక్కించారు. ఈ సినిమా కార్య‌రూపం దాల్చ‌డంలో త్రివిక్ర‌మ్ అన్నీ తానై న‌డిపించారు. అంతే కాకుండా ఈ చిత్రానికి మాట‌లు, స్క్రీన్ ప్లే అందించారు కూడా. ఈ చిత్రానికి సాగ‌ర్ కె. చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మ్యూజిక్‌, ప్ర‌మోష‌న్స్ .. ఇలా ప్ర‌తీదీ త్రివిక్ర‌మ్ ద‌గ్గ‌రుండి చూసుకున్నార‌ట‌.

అందుకు ఆయ‌న‌కు స్పెష‌ల్ ప్యాకేజీ అందింది. అయితే త‌న త‌దుప‌రి చిత్రాల విష‌యంలోనూ త్రివిక్ర‌మ్ ప్ర‌మోయం వుండాల‌ని, ఇందుకు ఆయ‌న‌కు ప్ర‌త్యేక ప్యాకేజీ ని కేటాయించాల‌ని ప‌వ‌న్ క‌ల్యాన్ నిర్మాత‌ల‌ని డిమాండ్ చేస్తున్నార‌ని ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. ప్ర‌స్తుతం ఇది ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా వుంటే అస‌లు త్రివిక్ర‌మ్ స్పెషల్ ప్యాకెజీ అడ‌గ‌డం లేద‌ని, క‌నీసం తీసుకోవ‌డానికి కూడా ఆస‌క్తిని చూపించ‌డం లేద‌ని మ‌రో వ‌ర్గం చెబుతోంది.

ప‌వ‌న్ తో త్రివిక్ర‌మ్ కున్న సాన్నిహిత్యం, వారిద్ద‌రి మ‌ధ్య వున్న అనుబంధం అంద‌రికి తెలిసిందే. ఆ బంధం కార‌ణంగానే స్నేహితుడైన ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమాకు త‌న వంతు స‌హ‌కారం అందిస్తున్నారు అంతే కానీ త్రివిక్ర‌మ్ డ‌బ్బులు ఆశించ‌డం లేద‌ని అంటున్నారు. ఇటీవ‌ల ప‌వ‌న్ న‌టించిన రీమేక్ మూవీ `భీమ్లానాయ‌క్‌`. ఈ చిత్రాన్ని సీతార ఎంట‌ర్ టైన్ మెంట్స్ బ్యాన‌ర్ పై సూర్యదేవ‌ర నాగ‌వంశీ నిర్మించారు. కానీ వెన‌క వుండి అంతా చూసుకుంది మాత్రం త్రివిక్ర‌మ్‌, స్టార్ ప్రొడ్యూస‌ర్, హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ అధినేత ఎస్. రాధాకృష్ణ‌.

అంటే ఇది త్రివిక్ర‌మ్ హోమ్ బ్యాన‌ర్‌. అలాంట‌ప్పుడు ప్ర‌త్యేకంగా ప్యాకేజీ ఏముంటుంది? .. సొంత సంస్థ కాబ‌ట్టే త్రివిక్ర‌మ్ అంతా ద‌గ్గ‌రుండి చూసుకున్నారు. మాట‌లు, స్క్రీన్ ప్లే అందించారు అని కొంత మంది చెబుతున్నారు. ఇదే త‌ర‌హాలో ప‌వ‌న్ న‌టించ‌నున్న మ‌రో రీమేక్ మూవీ `వినోదాయ సితం`కు కూడా త్రివిక్ర‌మ్ వెన‌కుండి అన్నీ చూసుకుంటున్నారు. దీనికి ఆయ‌న వ‌న్ ఆఫ్ ద ప్రొడ్యూస‌ర్ గా కూడా వ్య‌వ‌హ‌రించ‌బోతున్నారని గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వినిపిస్తున్న విష‌యం తెలిసిందే.