Begin typing your search above and press return to search.

మాయావితో ప‌వ‌న్ జైత్రయాత్ర ఎండ్ లెస్

By:  Tupaki Desk   |   2 March 2022 3:53 AM GMT
మాయావితో ప‌వ‌న్ జైత్రయాత్ర ఎండ్ లెస్
X
ఆయ‌న లేనిదే ఈయ‌న లేరు! ఈయ‌న లేనిదే ఆయ‌న లేరు! ఒక‌రికొక‌రు ఒక‌రి కోసం ఒక‌రు.. ఎవ‌రు లేక‌పోయినా ఇంకేదీ జ‌ర‌గ‌దు!! అన్న‌ట్టుగానే ఉంది. అంత‌గా ఆ ఇద్ద‌రి స్నేహం కొన‌సాగుతోంది. అత‌డు ఏ సినిమా చేసినా ఇత‌డు ఉండాలి. డైరెక్ష‌న్ లేదా ర‌చ‌న లేదా ప‌ర్య‌వేక్షణ లేదా ఇంకేదైనా కానీ ఇత‌డు ఉండాల్సిందే.

ఇంత‌కీ అత‌డు ఎవ‌రు అంటే ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌. ఇత‌డు ఎవ‌రు? అంటే మాయావి త్రివిక్ర‌మ్. ఈ స్నేహితులిద్ద‌రి జ‌ర్నీ ఎంతో ఆస‌క్తిని క‌లిగిస్తోంది. అంద‌రిలో స్ఫూర్తిని నింపుతోంది. ఇది స‌క్సెస్ ఫుల్ జోడీ. ప‌ర్ఫ‌క్ట్ గా వేవ్ లెంగ్త్ కుదిరిన స్నేహ‌మిది. అందుకే ఈ జోడీ జైత్ర‌యాత్ర‌ను కొన‌సాగిస్తోంది.

పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ కాంబో మునుముందు మ‌రిన్ని క్రేజీ చిత్రాల‌కు క‌లిసి ప‌ని చేయ‌నున్నారు. అది కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు వీరి నుంచి రానున్నాయి. త్రివిక్రమ్ ఇప్ప‌టికే పవన్ కళ్యాణ్ చేయ‌నున్న సినిమాల‌న్నిటిలో ప‌ని చేస్తుండ‌డం ఆస‌క్తిక‌రం. వీరిద్దరూ ఇటీవల భీమ్లా నాయక్ కోసం కలిసి ప‌ని చేశారు. తాజా సమాచారం ప్ర‌కారం.. మళ్లీ వీరిద్దరూ కలిసి ప‌ని చేస్తారు.

ఈసారి కూడా మ‌రో రీమేక్ ని లాక్ చేశార‌ని తెలిసింది. సూపర్ హిట్ తమిళ చిత్రం `తేరి` తెలుగు రీమేక్ కోసం పవన్ కళ్యాణ్- త్రివిక్రమ్ కలిసి పని చేయ‌నున్నార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఆస‌క్తిక‌రంగా సాహో ఫేం సుజీత్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తార‌ని త్రివిక్ర‌మ్ ప‌ర్య‌వేక్షిస్తాడ‌ని టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహిస్తాడని గుస‌గుస వినిపిస్తున్నా.. పూర్తి వివ‌రాలు ఇంకా వెల్ల‌డి కాలేదు. ర‌చ‌నా విభాగంలో సుజీత్ కి అన్నివిధాలా త్రివిక్ర‌ముని సాయం ఉంటుంది.

ఇక తేరి క‌థాంశం ఆసక్తిక‌రం. ఇది కూడా ఒక కాప్ డ్రామా. లా అండ్ ఆర్డర్ ని అమలు చేయడానికి ఎంతకైనా తెగించే నిజాయితీప‌రుడైన ధైర్యం ఉన్న పోలీసు అధికారి చుట్టూ తేరి క‌థ‌ తిరుగుతుంది. ఒరిజినల్ లో విజయ్ పోషించిన పాత్రను పవన్ చేయనున్నారు.

ఆర్‌.ఆర్‌.ఆర్ నిర్మాత డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. త్వ‌ర‌లోనే సెట్స్‌పైకి వెళ్లేందుకు ఆస్కారం ఉంది. పవన్ కళ్యాణ్ ఒకదాని తర్వాత మరొకటిగా రీమేక్ లను లైన్లో పెట్టేస్తున్నాడు. భీమ్లా నాయక్ తర్వాత తేరి మరియు వినోదయ సీతమ్ చిత్రాల తెలుగు రీమేక్ లు చేస్తున్నారు. అయితే అంత‌కుముందే హ‌రీష్ శంక‌ర్ తో క‌మిట్ మెంట్ ఉన్న సంగ‌తి తెలిసిందే. సురేంద‌ర్ రెడ్డి స్క్రిప్టును రెడీ చేస్తున్నారు.