Begin typing your search above and press return to search.

మళ్లీ పొరబడ్డ బండ్ల.. పవన్‌ ఫ్యాన్స్‌ ట్రోల్స్‌

By:  Tupaki Desk   |   2 Sept 2020 2:20 PM IST
మళ్లీ పొరబడ్డ బండ్ల.. పవన్‌ ఫ్యాన్స్‌ ట్రోల్స్‌
X
కొన్ని రోజుల క్రితం రామ్‌ గోపాల్‌ వర్మ 'పవర్‌ స్టార్‌' సినిమా గురించి ఒక ట్వీట్‌ చేశాడు. పవన్‌ కు వ్యతిరేకంగా ఉన్న ఆ ట్వీట్‌ ను ఫ్యాన్స్‌ అంతా కూడా వ్యతిరేకిస్తూ ఉంటే బండ్ల గణేష్‌ మాత్రం ఆ ట్వీట్‌ కు లైక్‌ కొట్టాడు. అది కొద్ది సేపట్లోనే వైరల్‌ అయ్యింది. పవన్‌ ను దేవుడు రాముడు అంటూ తెగ మాటలు చెప్పే బండ్ల గణేష్‌ ఎలా ఆ ట్వీట్‌ కు లైక్‌ కొట్టాడు అంటూ విమర్శలు వ్యక్తం అయ్యాయి. వెంటనే పరిస్థతి అర్థం చేసుకున్న బండ్ల గణేష్‌ తన ట్విట్టర్‌ హ్యాండిల్‌ నుండి ఆ పోస్ట్‌ పోయేలా అన్‌ లైక్‌ చేశాడు. ఆ తర్వాత వివరణ కూడా ఇచ్చాడు. ఆ సమయంలో సరే అనుకున్న పవన్‌ ఫ్యాన్స్‌ మళ్లీ ఇప్పుడు బండ్ల చేసిన పనికి తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.

నేడు పవన్‌ కళ్యాణ్‌ బర్త్‌ డే సందర్బంగా బండ్ల గణేష్‌ మళ్లీ అదే ట్విట్టర్‌ వేదికగా ఒక తప్పు చేశాడు. ఈసారి హ్యాష్‌ ట్యాగ్‌ తప్పుగా ఇచ్చి పరువు తీసుకున్నాడు. థ్యాంక్యూ పవన్‌ కళ్యాణ్‌ అంటూ పెట్టకుండా హ్యాష్‌ ట్యాగ్‌ లో యాంటీ పవన్‌ ఫ్యాన్స్‌ క్రియేట్‌ చేసిన పావలా కళ్యాణ్‌ ను ఉపయోగించాడు. అది తెలియక చేశాడనే అందరు అనుకుంటున్నారు. కాని కనీసం అది కూడా తెలియకుంటే ఎలా అంటూ పవన్‌ ఫ్యాన్స్‌ ట్రోల్స్‌ చేస్తున్నారు.

పవన్‌ గురించి మాత్రమే కాకుండా బండ్ల గణేష్‌ రెగ్యులర్‌ గా ఏదో ఒక తప్పును ట్యాగ్‌ చేయడం లేదంటే హ్యాష్‌ ట్యాగ్‌ తో పోస్ట్‌ చేయడం చేస్తున్నాడు. మీలాంటి వారికి ఎందుకు అండి ఇలా ట్విట్టర్‌ అంటూ కొందరు ఎద్దేవ చేస్తున్నారు. వెంటనే ఈ ట్వీట్‌ ను డిలీట్‌ చేసినప్పటికి జరగాల్సిన నష్టం జరిగి పోయింది. చాలా మంది యాంటీ ఫ్యాన్స్‌ స్ర్కీన్‌ షాట్స్‌ తీసుకుని దాన్ని వైరల్‌ చేస్తున్నారు. ముందు ముందు అయినా బండ్ల ఇలాంటివి రిపీట్‌ కాకుండా చూసుకుంటే మంచిదని పవన్‌ ఫ్యాన్స్‌ సూచిస్తున్నారు.