Begin typing your search above and press return to search.

పవన్ vs అజిత్.. పోటీకి సిద్ధమైన కుర్ర హీరో..!

By:  Tupaki Desk   |   2 Feb 2022 8:30 AM GMT
పవన్ vs అజిత్.. పోటీకి సిద్ధమైన కుర్ర హీరో..!
X
రాజావారు రాణిగారు' సినిమాతో హీరోగా పరిచయమైన కిరణ్ అబ్బవరం.. గతేడాది 'SR కళ్యాణమండపం' చిత్రంతో కమర్షియల్ సక్సెస్ అందుకున్నారు. ఇప్పుడు తాజాగా 'సెబాస్టియన్ P.C.524' అనే సినిమాని విడుదలకు సిద్ధం చేసారు. ఫిబ్రవరి 25వ తేదీన ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళంలోనూ ఒకేసారి విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే అదే రోజున రాబోయే రెండు పెద్ద సినిమాలతో కుర్ర హీరో పోటీ పడాల్సి వస్తోంది.

పవన్ కళ్యాణ్ - రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్ ‘భీమ్లా నాయక్’ ను కుదిరితే ఫిబ్ర‌వ‌రి 25న.. కుదరకపోతే ఏప్రిల్ 1న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఇప్పుడు మేక‌ర్స్ మాత్రం ఏప్రిల్ వ‌ర‌కు ఆగే ఆలోచ‌న చేయడం లేద‌ని ఫిలిం సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. ఇదే కనుక నిజమైతే ఈ నెల 25నే పవన్ సినిమాను వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేసే అవ‌కాశం ఉంది.

ఇదిలా ఉంటే కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ 'వాలిమై' రిలీజ్ డేట్ ని మేకర్స్ తాజాగా అనౌన్స్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 24న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. తమిళంతో పాటుగా తెలుగు హిందీ కన్నడ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. దీంతో ఇప్పుడు కిరణ్ అబ్బవరం ఓ ఇంట్రెస్టింగ్ కామెడీ మూవీతో.. సౌత్ లోని ఇద్దరు స్టార్ హీరోలైన పవన్ కళ్యాణ్ - అజిత్ లతో పోటీ ఎదుర్కోవాల్సి వస్తుంది.

పవన్ కళ్యాణ్ సినిమాలు ఏ రేంజ్ లో రిలీజ్ అవుతాయో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అజిత్ కు కూడా తెలుగులో మంచి క్రేజ్ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక చిన్న హీరో సినిమాని థియేటర్లలోకి తీసుకురావడం అంటే సాహసమనే అనుకోవాలి. మరి రాబోయే రోజుల్లో ఏమి జరుగుతుందో చూడాలి. ఇకపోతే ‘భీమ్లా నాయక్’ చిత్రానికి పోటీగా 'సెబాస్టియన్ P.C.524' సినిమాని రిలీజ్ చేయడంపై ట్విట్టర్ వేదికగా హీరో కిరణ్ అబ్బవరం.. ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చాడు.

''ఫిబ్రవరి 25న 'భీమ్లా నాయక్' రిలీజ్ ఉందని తెలియదా భయ్యా?. అదే డేట్ కి ఎలా వస్తారు? మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని ఎన్నోసార్లు చెప్పావ్? ఏంది భయ్యా ఇది'' అని ఓ నెటిజన్ ట్వీట్ చేసారు. దీనికి స్పందించిన కిరణ్ అబ్బవరం.. 'నేను మీకంటే కాస్త ఎక్కువగానే 'భీమ్లా నాయక్' కోసం ఎదురు చూస్తున్నాను.. ఆరోజు నా సినిమా రిలీజ్ ఉన్నా సరే ఫస్ట్ డే ఫస్ట్ షో రచ్చ ఆయన మూవీలోనే' అని ట్వీట్ చేసారు.