Begin typing your search above and press return to search.

2022లో ప‌వ‌న్ - త్రివిక్ర‌మ్ పాన్ ఇండియా మూవీ?

By:  Tupaki Desk   |   12 Jun 2021 11:00 AM IST
2022లో ప‌వ‌న్ - త్రివిక్ర‌మ్ పాన్ ఇండియా మూవీ?
X
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ బ్యాక్ టు బ్యాక్ క‌థ‌లు విని దర్శ‌కుల్ని ఫైన‌ల్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు- అయ్య‌ప్ప‌నుమ్ కోషియం త‌ర్వాత హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తారు. ఆ త‌ర్వాత కూడా ప‌వ‌న్ కోసం నార‌ప్ప‌ ద‌ర్శ‌కుడు శ్రీ‌కాంత్ అడ్డాల స్క్రిప్టు రెడీ చేస్తున్నార‌ని క‌థ‌నాలొచ్చాయి.

ఈలోగానే రేస్ లోకి త్రివిక్ర‌మ్ పేరు దూసుకొచ్చింది. గత కొన్ని వారాలుగా పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ తో కలిసి పనిచేస్తారని క‌థ‌నాలొస్తున్నాయి. తాజా స‌మాచారం మేర‌కు.. త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ తో కలిసి పాన్-ఇండియా ప్రాజెక్టును ప్లాన్ చేస్తున్నార‌ని తెలిసింది. ఇప్పటికే దాని కోసం స్క్రిప్టింగ్ ను ప్రారంభించాడు. ఎస్.ఎస్.ఎం.బి28 పూర్త‌య్యాక ప‌వ‌న్ ని బౌండ్ స్క్రిప్ట్ తో సంప్రదిస్తాడని తెలిసింది.

త్రివిక్రమ్ పాన్-ఇండియా ప్రాజెక్ట్ ప్రతిపాదన తెచ్చాక‌ పవన్ కళ్యాణ్ చాలా ఉత్సాహంగా ఉన్నార‌ని తెలిసింది. ఈ ప్రాజెక్ట్ 2022 మిడ్ లో లేదా ఆ తరువాత మాత్రమే ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. జ‌ల్సా-అత్తారింటికి దారేది- అజ్ఞాత‌వాసి త‌ర్వాత ప‌వ‌న్ - త్రివిక్ర‌మ్ కాంబినేషన్ మూవీ కోసం అభిమానులు ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు.