Begin typing your search above and press return to search.

రొమాంటిక్ సాంగ్ షూట్ లో పవన్ - శృతి హాసన్..?

By:  Tupaki Desk   |   19 Dec 2020 11:15 AM IST
రొమాంటిక్ సాంగ్ షూట్ లో పవన్ - శృతి హాసన్..?
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ మూవీగా 'వకీల్ సాబ్' రూపొందుతున్న విషయం తెలిసిందే. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని బోనీకపూర్ సమర్పణలో దిల్ రాజు - శిరీష్ కలిసి నిర్మిస్తున్నారు. ఇది హిందీ హిట్ సినిమా 'పింక్' కి రీమేక్. ఇందులో పవన్ కళ్యాణ్ కి జోడీగా శృతి హాసన్ కనిపించనుంది. చివరి దశలో ఉన్న ఈ సినిమా షూటింగ్ లో శృతి హాసన్ కూడా పాల్గొంటోంది. పవన్ - శ్రుతి మధ్య ఓ రొమాంటిక్ సాంగ్ ని షూట్ చేయనున్నారని సమాచారం. దీని కోసం వచ్చే రెండు వారాలు కాల్ షీట్స్ ఇచ్చిన పవన్.. ఈ షెడ్యూల్ తో షూటింగ్ పూర్తి చేయనున్నాడు. ఇక పవన్ - శృతి హాసన్ ఎపిసోడ్స్ ఫ్లాష్ బ్యాక్ లో ఉంటాయని తెలుస్తోంది. నిడివి తక్కువ అయినప్పటికీ బిగ్ ప్రాజెక్ట్ కావడం, దానికి తగ్గట్టుగా రెమ్యూనరేషన్ ఇవ్వడంతో శృతి ఈ పాత్ర చేయడానికి ఒప్పుకుందని తెలుస్తోంది.

కాగా, పవన్ కళ్యాణ్ - శ్రుతి హాసన్ కలిసి ఇంతకముందు 'గబ్బర్ సింగ్' 'కాటమ రాయుడు' వంటి సినిమాల్లో నటించారు. ఈ కాంబోలో వాడుతున్న హ్యాట్రిక్ మూవీతో మరో హిట్ కొడతారని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు. ఈ చిత్రంలో నివేధా థామస్ - అంజలి - అనన్య వంటి హీరోయిన్లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. థమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి పీఎస్ వినోద్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన 'వకీల్ సాబ్' ప్రచార చిత్రాలు మరియు 'మగువా మగువా' సాంగ్ విశేష స్పందన తెచ్చుకున్నాయి. పవన్ నుంచి చాలా గ్యాప్ తర్వాత వస్తున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే 'వకీల్ సాబ్' రిలీజ్ డేట్ పై క్లారిటీ రానుంది.