Begin typing your search above and press return to search.

సావిత్రి దర్శకుడితో నందమూరి మల్టీ స్టారర్

By:  Tupaki Desk   |   5 Feb 2017 8:17 PM GMT
సావిత్రి దర్శకుడితో నందమూరి మల్టీ స్టారర్
X
నందమూరి కళ్యాణ్ రామ్ తన లేటెస్ట్ మూవీ ఇజం తర్వాత.. ప్రాజెక్టుల ఎంపిక విషయంలో చాలా కేర్ ఫుల్ గా ఉంటున్నాడు. నిర్మాతగా ఎన్టీఆర్ హీరోగా ఓ సినిమా ప్రకటించేశాడు కానీ.. తను హీరోగా చేసే మూవీ సంగతి మాత్రం చెప్పలేదు. ఇప్పుడు కళ్యాణ్ రామ్ ప్రాజెక్ట్ ఒకటి ఫైనల్ అయిందని.. స్క్రిప్ట్ వర్క్ చివరి దశలో ఉందని తెలుస్తోంది.

ప్రేమ ఇష్క్ కాదల్ తో పరిచయమైన దర్శకుడు పవన్ సాదినేని.. ఈ ఏడాది సావిత్రి అంటూ నారా రోహిత్ తో మరో మూవీ అందించాడు. రిజల్ట్ సంగతి ఎలా ఉన్నా.. ఫ్యామిలీ ఎమోషన్స్ ను పండించిన తీరు చూసి.. కళ్యాణ్ రామ్ ఆఫర్ ఇచ్చాడట. దీన్ని పక్కాగా ఉపయోగించుకున్న పవన్ సాదినేని.. ఓ చక్కని ఫ్యామిలీ స్టోరీ చెప్పాడట. ఇందులో తండ్రి నందమూరి హరికృష్ణకు కీలక పాత్ర ఉండడం.. అది కూడా పవర్ ఫుల్ రోల్ అంటున్నారు. చూస్తుంటే ఇదేదో నందమూరి మల్టీస్టారర్ అనిపించడం లేదూ? అందుకే దీన్ని వెంటనే స్టార్ట్ చేసేద్దాం అన్న కళ్యాణ్ రామ్ ఫైనల్ స్క్రిప్ట్ ప్రిపేర్ చేయమనడంతో.. ప్రస్తుతం ఈ దర్శకుడు అదే పనిలో ఉన్నాడట.

విశాఖపట్నంలో ఎక్కువ భాగం సాగే ఈ చిత్రం.. హైద్రాబాద్ లోనూ కొంత పార్ట్ షూటింగ్ చేస్తే సరిపోతుందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని కూడా తనే నిర్మించే యోచనలో ఉన్నాడట కళ్యాణ్ రామ్. ముఖ్యంగా 15 కోట్ల లోపు బడ్జెట్ తో ఫినిష్‌ చేస్తే.. ఈ సినిమా టేబుల్ ప్రాఫిట్లతో అల్లల్లాడిస్తుందని కళ్యాణ్ రామ్ ప్లాన్. చూద్దాం ఏమవుతుందో!!