Begin typing your search above and press return to search.

మామ దారిలో బ‌న్నీ న‌డుస్తాడా?

By:  Tupaki Desk   |   30 April 2018 11:06 AM GMT
మామ దారిలో బ‌న్నీ న‌డుస్తాడా?
X
నంద‌మూరి కుటుంబంలాగే మెగా కుటుంబానికీ రాజ‌కీయాల‌తో అవినాభావ సంబంధం ఉంది. మొన్న మెగాస్టార్ చిరంజీవి ప్ర‌జారాజ్యం పార్టీ పెడితే... ఇప్పుడు ఆయ‌న త‌మ్ముడు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ జ‌న‌సేన అంటూ జ‌నాల్లోకి వెళ్లాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు. వీరి బాట‌లోనే మెగా మేన‌ల్లుడు అల్లుఅర్జున్ కూడా రాజ‌కీయాల్లోకి వెళ‌తాడా? ‘నా పేరు సూర్య’ అంటూ మిల‌ట‌రీ జ‌వాన్ వేషం వేసిన బ‌న్నీ... ఖ‌ద్ద‌రు చొక్కా వేసి పాలిటిక్స్ చేయ‌బోతున్నాడా?

నిన్న సాయంత్రం జ‌రిగిన ‘నా పేరు సూర్య’ ప్రీ రిలీజ్ వేడుక సాక్షిగా ఈ అనుమానాల‌న్నీ త‌లెత్తున్నాయి. అస‌లు విష‌యం ఏమిటంటే... ఈ వేడుక‌కి సినీ రంగానికి చెందిన ప్ర‌ముఖుల‌తో పాటు రాజ‌కీయ నాయ‌కులూ అతిథులుగా హాజ‌ర‌య్యారు. అందులో తెలుగుదేశం ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి కొడుకు జేసీ ప‌వ‌న్ రెడ్డి కూడా ఉన్నాడు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ... ‘బ‌న్నీ గురించి మీకెవ‌రికీ తెలియ‌ని ఓ విషయం చెబుదామ‌నుకుంటున్నాను. ఆయ‌న‌కి రాజ‌కీయ అవ‌గాహ‌న చాలా ఎక్కువ‌. లోక‌ల్ పాలిటిక్స్ నుంచి నేష‌న‌ల్ పాలిటిక్స్ దాకా అన్నీ క్షుణ్ణంగా ఫాలో అవుతుంటాడు. ఆయ‌నకి మంచి రాజ‌కీయ వేత్త అయ్యే ల‌క్ష‌ణాలు పుష్క‌లంగా ఉన్నాయి. భ‌విష్య‌త్తులో పాలిటిక్స్ లోకి వ‌స్తార‌నుకుంటా...’ అంటూ పెద్ద షాకే ఇచ్చాడు ప‌వ‌న్ రెడ్డి.

ప‌వ‌న్ రెడ్డి వ్యాఖ్యల‌కు న‌వ్వుతూ... చేతులు ఊపుతూ లేదు... లేద‌న్న‌ట్టు సైగ‌లు చేశాడు స్టైలిష్ స్టార్‌. బ‌న్నీకి స్టార్ హీరో అనే అహం ఉండ‌ద‌ని చెప్పిన ప‌వ‌న్ రెడ్డి... ఆయ‌న త‌న మూలాలు తెలుసుకుని భూమ్మీదే న‌డుస్తాడ‌ని అన్నాడు. ‘నా పేరు సూర్య’ క‌చ్చితంగా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ట‌వ్వుతుంద‌ని పందెం కాస్తాన‌ని చెప్పిన జేసీ ప‌వ‌న్ రెడ్డి... ఈ సినిమా సీడెడ్ హ‌క్కుల‌ను ఫ్యాన్సీ రేటుకి కొనుక్కోవ‌డం విశేషం.