Begin typing your search above and press return to search.

జనాలకు సినిమాలు.. జనం కోసం పవన్

By:  Tupaki Desk   |   11 Feb 2017 6:30 PM IST
జనాలకు సినిమాలు.. జనం కోసం పవన్
X
పవన్ కళ్యాణ్.. సినిమాలు.. డబ్బు.. జనాలు.. ఇవన్నీ ఒకదానితో ఒకటి లింక్ అయిపోయినట్లుగా కనిపిస్తున్నాయి. తాజాగా హార్వర్డ్ యూనివర్సిటీలో స్పీచ్ ఇవ్వనున్న పవర్ స్టార్.. అమెరికాలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. గతంలో చెప్పిన మాదిరిగానే.. డబ్బుల కోసమే సినిమాలు చేస్తున్నానని కూడా అనడం విశేషం.

తనకు ఇంత ఇచ్చిన జనాల కోసం రాజకీయంగా పోరాటం చేయాలన్నది పవన్ ఉద్దేశ్యం. ప్రశ్నించడం కోసమే జనసేన పెట్టానని.. పదవుల కోసం కాదని ముందు నుంచి చెబుతూనే ఉన్నాడు. పార్టీ నడిపేందుకు చాలానే డబ్బులు అవసరం అనే విషయం తెలిసిందే. అయితే.. ఫండ్స్ అంటూ తీసుకోవడం మొదలుపెడితే బాగానే వస్తాయ్ కానీ.. ఒత్తిళ్లు పెరుగుతాయ్.

అదే తన డబ్బుతోనే పార్టీ నడిపించాలన్నది పవన్ ఉద్దేశ్యం కావచ్చు. కేవలం రాజకీయాలకు అంటే పార్టీ నడపడానికి అవసరమైన డబ్బు కోసం సినిమాలు చేస్తూనే ఉంటానని పవన్ కళ్యాణ్ మరోసారి చెప్పాడు.
జనాలు పవన్ నుంచి ముందుగా కోరుకుంటున్నది అదే కాబట్టి ఫ్యాన్స్ హ్యాపీ. డబ్బు కోసం చేసినా.. జనాలు చూసేందుకే ఆ సినిమాలు కాబట్టి.. పవన్ కూడా హ్యాపీ. సినిమాల్లో పవన్ ను చూసి జనాలు చూసి ఎంజాయ్ చేయచ్చు. తద్వారా వచ్చిన డబ్బుతో.. జనం కోసం పవన్ పోరాటం చేయచ్చు. ఈ ఈక్వేషన్ ఏదో బాగానే సెట్ అయినట్లుగా ఉంది.