Begin typing your search above and press return to search.

#ప‌వ‌నిజం.. మోకాళ్ల‌పై కూచుని సింపుల్ గా

By:  Tupaki Desk   |   21 Dec 2020 4:20 PM IST
#ప‌వ‌నిజం.. మోకాళ్ల‌పై కూచుని సింపుల్ గా
X
సింప్లిసిటీని ఇష్ట‌ప‌డే స్టార్ గా ప‌వ‌న్ క‌ల్యాణ్ ని అభిమానులు ఎంతో ఇష్ట‌ప‌డ‌తారు. ఆయ‌న ఏం చేసినా ఎంతో సింపుల్ గా ఉంటుంది. హైద‌రాబాద్ ఔటర్ ఫామ్ హౌస్ లో నివ‌శించినా.. తోట‌లో కూర‌గాయలు పండించి మామిడి తోట‌కు నీళ్లు పెడుతూ రైతన్న‌లా మారినా ఆయ‌న‌కే చెల్లింది.

అంత పెద్ద సూప‌ర్ స్టార్ ఇంత సింపుల్ గా జీవించ‌డం అనేది అభిమానుల్లోనే కాదు అన్ని వ‌ర్గాల్లోనూ నిరంత‌రం చ‌ర్చ‌నీయాంశ‌మే. ఇక ఫ్యాన్స్ కి ఆయ‌న ఇచ్చే గౌర‌వం అంతా ఇంతా కాదు. త‌న‌తో ఫోటోలు దిగ‌డానికి వ‌స్తే వారిని దూరంగా తోసేయ‌రు. ఏవిధంగానూ భేష‌జానికి పోరు. వెంట‌నే వారికి స‌హ‌క‌రించి లైవ్ లొకేష‌న్ లోనే ఫోటోలు దిగేస్తారు.

ప్ర‌స్తుతం వ‌కీల్ సాబ్ సెట్లో ఉన్న ప‌వ‌న్ తో ఫోటోలు దిగేందుకు వంద‌లాదిగా అభిమానులు గుమిగూడుతున్నారు. స్పాట్ లో ఎవ‌రినీ నిరాశ‌ప‌ర‌చ‌కుండా ప‌వ‌న్ ఇలా గ్రూప్ ఫోటోలు దిగుతున్నారు. అందులోంచి ఒక రేర్ ఫోటో ఇది. ఇలా మోకాళ్ల‌పై ఫోటో దిగారు అభిమానుల‌తో. ఈ ఫోటోని వైర‌ల్ చేస్తూ ప‌వ‌నిజం అంటే ఇదే.. సింప్లిసిటీలో ప‌వ‌న్ ది బెస్ట్ అంటూ అభిమానులు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. వ‌కీల్ సాబ్ త్వ‌ర‌లోనే రిలీజ్ కానుంది. అలాగే త‌దుపరి చిత్రాల‌కు ప్ర‌ణాళిక‌ల్ని సిద్ధం చేస్తున్న ప‌వ‌న్ క‌ల్యాణ్ ఈ షెడ్యూల్స్ మిస్ చేయ‌కుండా జ‌న‌సేనానిగా రాజ‌కీయాల ప‌రంగానూ యాక్టివ్ కానున్నార‌ని తెలుస్తోంది.