Begin typing your search above and press return to search.

పవన్ మాటతో త్రివిక్రమ్ రిలాక్స్!

By:  Tupaki Desk   |   30 Oct 2018 11:04 AM IST
పవన్ మాటతో త్రివిక్రమ్ రిలాక్స్!
X
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ను అజ్ఞాతవాసి తాలూకు చేదు జ్ఞాపకాలు చాలా కాలం వెంటాడాయి. తన నుంచి ఇలాంటి సినిమాను ఆశించని అభిమానులు దీని వల్లే బాగా హర్ట్ అయ్యారు కూడా. మొత్తానికిని వాటిని సమూలంగా చెరిపేస్తూ అరవింద సమేత వీర రాఘవ సూపర్ హిట్ కావడం అందరికి సంతోషపరిచింది. ముఖ్యంగా త్రివిక్రమ్ తనలోని ఒరిజినల్ మేకర్ ని మరోసారి బయటికి తీసుకువచ్చినందుకు సినిమా ప్రియులు సంబర పడ్డారు. అయితే ఇక్కడ మరో విశేషం ఉంది. విడుదలైన మొదటి రెండు రోజుల్లోనే పవన్ త్రివిక్రమ్ కు వ్యక్తిగతంగా ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పాడట.

సినిమా బాగుందనే టాక్ వింటున్నానని చాలా సంతోషంగా ఉందని పవన్ చెప్పాక అంత కంటే ఆనందం ఏముంటుంది. ఈ ఇద్దరి మధ్య ఎంత బలమైన స్నేహం ఉందొ తెలిసిందే. అరవింద సమేత వీర రాఘవ ఓపెనింగ్ షాట్ కు అతిధిగా వచ్చింది పవనే. ఆ సందర్భంలో పవన్ తారక్ లు సరిగా అల్లరి చేయటం అందరిని ఆకట్టుకుంది కూడా. సో మిత్రుడికి హిట్ వస్తే తనకు వచ్చినట్టే అని ఫీలైన పవన్ ఈ రకంగా తన ఆనందాన్ని షేర్ చేసుకున్నాడన్న మాట. ఇక్కడ మరో విశేషం ఉంది. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లోనే పవన్ తో త్రివిక్రమ్ గతంలో కోబలి అనే సినిమా ప్లాన్ చేసుకున్నాడు.

దాని కోసం సీమ స్థితిగతులు యాస మీద చాలా రీసెర్చ్ కూడా చేసాడు. టైటిల్ కూడా ఫిక్స్ చేసుకున్నారు. కానీ ఏవో కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేకపోయింది. అప్పుడు భద్రపరుచుకున్న ఇన్ ఫుట్స్ అరవింద సమేత వీర రాఘవ కోసం వాడుకున్నానని ఇటీవలే ఓ ప్రమోషన్ ఇంటర్వ్యూ లో త్రివిక్రమ్ చెప్పాడు. సో ఇన్నిరకాలుగా కనెక్ట్ అయిన సినిమా హిట్ అయినప్పుడు పవన్ ఇలా ప్రత్యేకంగా అభినందనలు తెలపడం సబబేగా.