Begin typing your search above and press return to search.

సెట్స్ నుంచి కాటమరాయుడు వాకౌట్!?

By:  Tupaki Desk   |   26 Oct 2016 5:16 AM GMT
సెట్స్ నుంచి కాటమరాయుడు వాకౌట్!?
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ స్టార్ట్ అవడమే ఆలస్యం.. అక్కడ ఏదో జరుగుతోందంటూ ఏదో ఒక న్యూస్ హల్ చల్ చేస్తూ ఉంటుంది. వాళ్లకి వీళ్లకి పడ్డం లేదని.. వాళ్లు సైడ్ అయ్యారని.. వీళ్లు తప్పుకున్నారని వార్తలు తిరుగుతూ ఉంటాయ్. ఇందులో నిజంగా నిజాలు ఒకటో రెండోనే ఉంటాయి. ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే.. ఏకంగా తన లేటెస్ట్ మూవీ కాటమరాయుడు సెట్స్ నుంచి ఏకంగా పవన్ వాకౌట్ చేసేశాడట.

పవన్ మూవీ అంటే.. హోల్ అండ్ సోల్ గా అన్నీ పవన్ గ్రిప్ లోనే ఉంటాయి. అలాంటిది పవర్ స్టార్ కి సెట్స్ నుంచి బయటకు వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందా అనే సందేహం కరెక్టే. కెప్టెన్ ఆఫ్ ద షిప్ అయిన డైరెక్టర్ డాలీతోనే పవన్ కి మాటామాటా వచ్చిందట. ఓ సీన్ ని కన్విన్సింగ్ గా నేరేట్ చేసే విషయంలో డాలీ తడబడ్డంతో.. పవన్ గట్టిగా అరిచేశాడని అంటున్నారు. కొంతసేపు కంట్రోల్ చేసుకున్నా.. చివరకు గట్టిగానే మాట్లాడాడట పవన్.

తిరిగి సీన్ లోకి వెళ్లేందుకు మూడ్ సహకరించకపోవడం.. అప్పటికే సెట్ లో పరిస్థితి వేడెక్కడంతో.. ఇక అక్కడి నుంచి వేగంగా బయటకు వెళ్లిపోయాడట పవన్ కళ్యాణ్. పట్టుమని పావు శాతం షూటింగ్ కూడా పూర్తికాకుండానే అప్పుడే ఇలా జరిగిందేటబ్బా అని ఫ్యాన్స్ ఫ్యూచర్ పై బెంగ పెట్టేసుకున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/