Begin typing your search above and press return to search.

పవన్ కళ్యాణ్ ప్రభ తగ్గినట్లేనా..?

By:  Tupaki Desk   |   13 Jan 2022 4:30 PM GMT
పవన్ కళ్యాణ్ ప్రభ తగ్గినట్లేనా..?
X
పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’ మూవీ పరాజయం తర్వాత రాజకీయాల మీద ఫోకస్ పెట్టి సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే. అయితే దాదాపు మూడేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత ‘వకీల్ సాబ్’ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలో వరుసగా సినిమాలు అనౌన్స్ చేస్తూ ఫ్యాన్స్ ని ఉక్కిరిబిక్కిరి చేశారు. అంతేకాదు కెరీర్ లో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి రెండు సినిమాల షూటింగ్స్ చేస్తూ వచ్చారు.

పవన్ కళ్యాణ్ ఒక్కో సినిమాకు దాదాపు యాభై కోట్ల వరకు తీసుకుంటున్నారే ఊహాగానాలు ఉన్నాయి. అయినప్పటికీ స్టార్ హీరోకు ఉండే క్రేజ్ దృష్ట్యా నిర్మాతలు ఆయన డేట్స్ కోసం క్యూ కట్టారు. ఈ క్రమంలో తనతో సన్నిహితంగా ఉండే పలువురికి పవన్ కమిట్మెంట్ ఇచ్చారు.

కరోనా నేపథ్యంలో 'వకీల్ సాబ్' సినిమా ఆశించిన స్థాయిలో వసూళ్ళు రాబట్టలేకపోయింది. ప్రస్తుతం సాగర్ కె చంద్ర దర్శకత్వంలో 'భీమ్లా నాయక్' సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి చేశారు. అలానే క్రిష్ డైరెక్షన్ లో 'హరి హర వీరమల్లు' చిత్రం యాభై యాభై శాతం చిత్రీకరణ జరుపుకుంది. ఇక అధికారికంగా ప్రకటించిన హరీశ్ శంకర్ 'భవదీయుడు భగత్ సింగ్' మరియు సురేందర్ రెడ్డి సినిమాలను ఇంకా సెట్స్ మీదకు తీసుకెళ్లలేదు.

నిజానికి వీలైనంత త్వరగా కమిటైన సినిమాలు కంప్లీట్ చేసేలా పవన్ కళ్యాణ్ పాన్ చేసుకున్నారు. కానీ కరోనా వచ్చి ఆయన స్పీడుకి బ్రేకులు వేసింది. అన్ని సినిమాలతో పాటు పవన్ చేస్తున్న చిత్రాల షూటింగ్ లు నిలిచిపోయాయి. దీంతో సినిమాల విడుదలలో జాప్యం జరుగుతూ వచ్చింది. ఇప్పుడు కోవిడ్ థర్డ్ వేవ్ వచ్చింది. ఈ నేపథ్యంలో 'భీమ్లా నాయక్' తరువాత పవన్ నుంచి వచ్చే సినిమా మీద క్లారిటీ లేకుండా పోయిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలు నత్తనడకన సాగుతుండగా.. తరువాత వచ్చే ప్రాజెక్ట్స్ మీద స్టార్ హీరో పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదనే టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో గతేడాది పవన్ డేట్స్ కోసం వెయిట్ చేసిన నిర్మాతలు.. ఇప్పుడు ఎంత లేటైతే అంత మంచిదని భావించి, వెనక్కు తగ్గుతున్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.