Begin typing your search above and press return to search.
ఇంతలో ఎంత మార్పు? మెగా ఫ్యాన్స్ అంతా అవాక్కు!!
By: Tupaki Desk | 25 Sept 2020 2:40 PM ISTబాబాయ్ అబ్బాయ్ మాంచి జోరుమీదున్నట్టున్నారు. లాక్ డౌన్ కారణంగా గత ఆరు నెలలకు పైగా షూటింగ్ లు ఆగిపోవడంతో కొంత రిలాక్స్ మోడ్ లోకి వెళ్లిపోయిన అబ్బాయ్ రామ్ చరణ్ ..బాబాయ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మళ్లీ షూటింగ్ మోడ్ లోకి వచ్చేస్తున్నారు. రామ్ చరణ్ తను నటిస్తున్న `ఆర్.ఆర్.ఆర్`షూటింగ్ త్వరలో తిరిగి పునః ప్రారంభం కానున్న నేపథ్యంలో మళ్లీ తన లుక్ లోకి రావడమే కాకుండా ఆ ఫొటోని సోషల్ మీడియాలో అభిమానలతో పంచుకున్న విషయం తెలిసిందే.
తాజాగా పవన్ కల్యాణ్ లుక్ కూడా బయటికి వచేసింది. ఆయన `వకీల్ సాబ్` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. అయితే పవన్ మాత్రం షూట్ లో పాల్గొనడం లేదు. వచ్చే నెల మొదటి వారం నుంచి పవన్ సెట్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ నేపథ్యంలో బయటికి వచ్చిన పవన్ లుక్ ఆకట్టుకుంటోంది. పవన్ లేటెస్ట్ లుక్ అంటూ ఓ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
చతుర్మాస ధీక్ష కారణంగా బారుగా గుబురుగా గడ్డం పెంచి కొంచెం లావుగా కనిపించిన పవన్ తాజా ఫొటోలో మాత్రం స్లిమ్ గా ట్రిమ్డ్ షేవ్ లుక్ తో మ్యాన్లీగా మారారు. ఇదంతా `వకీల్ సాబ్` లుక్ లోకి ట్రాన్స్ ఫామ్ కావడమేనంటూ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఇంతలో ఎంత మార్పు? అని మెగా ఫ్యాన్స్ అంతా అవాక్కవుతున్నారు.