Begin typing your search above and press return to search.

మరోసారి తండ్రి కానున్న పవన్?

By:  Tupaki Desk   |   2 Sept 2017 10:15 AM IST
మరోసారి తండ్రి కానున్న పవన్?
X
టాలీవుడ్ లో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. అందరు హీరోలు సినిమాలపరంగా అభిమానులను సంపాదించుకుంటే.. పవన్ కి మాత్రం ఆయన వ్యక్తిత్వం ద్వారా అనేకమంది అభిమానులను సంపాదించుకున్నారు. అయితే ఆయన రాజకీయాల్లోకి వచ్చాక ఇప్పుడు నేషనల్ మీడియా కూడా తెలుగు రాజకీయాలపై ద్రుష్టి పెట్టింది.

అయితే ఓ వైపు రాజకీయాలలో సినిమాల్లో బిజీగా ఉన్న పవన్ కి త్వరలో మళ్లీ తండ్రి కాబోతున్నాడు అంటున్నారు సన్నిహితులు. పవన ప్రస్తుత సతీమణి రష్యన్-ఆస్ర్టేలియన్ అన్నా లేజ్నేవా మరొక బిడ్డకి జన్మనివ్వబోతోందట. అక్టోబర్ 14న డెలివరీ డేట్ కూడా కన్ఫర్మ్ చేశారని ఫిలిం నగర్ టాక్. అంటే దీపావళికి నాలుగు రోజుల ముందే పవన్ ఇంట్లో పండగ వాతావరణం నెలకొననుంది. ఇప్పటికే ఒక ఆడబిడ్డకు నిచ్చిన అన్నా మరో సారి పవన్ తండ్రిని చేయబోతోంది.

ఇప్పటికే పవన్ కు రేణు దేశాయ్ ద్వారా ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆకీరా అండ్ ఆర్య మనకు తెలిసినవారే. ఇక ఆయన ప్రస్తుత భార్య ద్వారా పొలేనా అనే కూతురు ఉంది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో తన 25వ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు.