Begin typing your search above and press return to search.

పవన్ కళ్యాణ్‌ కు వారి సత్కారం

By:  Tupaki Desk   |   11 Nov 2017 2:17 PM IST
పవన్ కళ్యాణ్‌ కు వారి సత్కారం
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ ఇప్పుడు రాజీకాయల్లోకి వచ్చాక తన అభిమాన గణాన్ని అలా ఉంచుకున్నాడా? లేదంటే జారవిడుచుకున్నాడా? ఎందుకంటే సినిమాల్లో అభిమానులుగా ఉన్నోళ్ళందరూ పాలిటిక్స్ దగ్గరకు వచ్చేసరికి ఉండాలని రూల్ లేదు. అయితే ఎలక్షన్లు రాజకీయాలు అటుంచితే.. పవన్ చేసే పనులకు కొంతమంది విద్యావేత్తలు వ్యాపారవేత్తలు మాత్రం ఫిదా అయిపోతున్నారు.

అసలు ఉద్దానం కిడ్నీ సమస్యల గురించి అందరూ మర్చిపోయిన వేళ.. పవన్ కళ్యాణ్‌ ఆ అంశాన్ని లేవనెత్తాడు. అంతేకాకుండా.. ఏకంగా హార్వర్డ్ విశ్వవిద్యాలయం దగ్గరకు వెళ్ళినప్పుడు కూడా దాని గురించి ప్రస్తావించి.. అక్కడ బాధితులకు ఏదన్నా ఇంటర్నేషనల్ సాయం అందేలా ప్రయత్నించాడు. పవన్ చేసిన రాయబారంతో హార్వార్డ్ మెడికల్ టీమ్ అధ్యయనానికి ఒక టీమ్ ను కూడా పంపింది. ఇవన్నీ గుర్తించిన ఇండో-యురోపియన్ బిజినెస్ ఫోరం వారు.. ఇప్పుడు పవన్ ను నువంబర్ 17న లండన్ లో సత్కరించనున్నారు.

ప్రస్తుతం బల్గేరియా క్రొయేషియా వంటి యురోపియన్ దేశాల్లో షూటింగుతో బిజీగా ఉన్న పవన్.. అజ్ఞాతవాసిపై తన పనులు ముగించుకుని.. 15న లండన్ వెళతాడట. అలాగే అక్కడ రెండు రోజులు పర్యటన చేసుకుని.. 18న ఇండియా తిరిగొస్తాడని టాక్. ఏదేమైనా కూడా పవన్ కు లభిస్తున్న ఈ సత్కారం చాలా గొప్పదే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇక ఆయన అభిమానుల ఆనందానికి అంతేలేదు.