Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ రంగంలోకి దిగాడా?!

By:  Tupaki Desk   |   7 Sep 2015 5:56 AM GMT
ప‌వ‌న్ రంగంలోకి దిగాడా?!
X
త‌నవ‌ల్ల ప‌దిమందికి మంచి జ‌ర‌గాల‌నుకొనే త‌త్వం ప‌వ‌న్‌ క‌ళ్యాణ్‌ ది. అభిమానులు ఇబ్బంది ప‌డ‌కూడ‌ద‌ని వేడుక‌లు జ‌రుపుకోవ‌డానికి కూడా ఆయ‌న ఇష్ట‌ప‌డ‌డు. వేలాది మంది అభిమానులు ఒక‌చోట‌కి వ‌చ్చిన‌ప్పుడు తొక్కిస‌ల్లాంటివి జ‌రుగుతాయి కాబ‌ట్టి చాలా వ‌ర‌కు సినిమా వేడుకలు జ‌రుపుకోవ‌డానికి నిరాక‌రిస్తుంటారాయ‌న‌. అలాంటి ప‌వ‌న్ అభిమానం పేరుతో ప్యాన్స్ వేరొక‌రితో గొడ‌వ‌ప‌డ‌టాన్ని, లేనిపోని ఇబ్బందులు కొని తెచ్చుకోవ‌డాన్ని ఇష్ట‌ప‌డ‌తారా? అస‌లే మాత్రం ఇష్ట‌ప‌డ‌రు. అందుకే భీమ‌వ‌రం ఇన్సిడెంట్ గురించి తెలిసిన వెంట‌నే అక్క‌డి అభిమాన సంఘాల‌కు ఫోన్ చేసి పరామ‌ర్శించాడ‌ట ప‌వ‌న్‌. ఇలాంటి అన‌వ‌స‌ర‌మైన వివాదాల జోలికి వెళ్లొద్ద‌ని సూచించాడ‌ట‌. మేమంతా ఒక్క‌టే అని, అభిమానులు అన‌స‌వ‌రంగా గొడ‌వ‌లు ప‌డ‌టం స‌రికాద‌ని చెప్పాడ‌ట‌. పోలీసుల‌తోనూ, అధికారుల‌తోనూ మాట్లాడి ఎవ్వ‌రికీ ఎలాంటి ఇబ్బంది జ‌ర‌గ‌కుండా స‌మ‌స్య‌ని సామ‌ర‌స్యంగా ప‌రిష్క‌రించాల‌ని కోరాడ‌ట‌.

ప్ర‌భాస్ అభిమానుల‌కీ, ప‌వ‌న్‌ క‌ళ్యాణ్ అభిమానుల‌కీ ఓ ఫ్లెక్సీ విష‌యంలో భీమ‌వ‌రంలో గొడ‌వ జ‌రిగిన విష‌యం తెలిసింది. ఆ గొడ‌వ చిలికి చిలికి గాలివాన‌లా మారి అల్ల‌ర్ల వ‌ర‌కు వెళ్లింది. ఇరు వ‌ర్గాలు రెచ్చిపోవ‌డంతో ప్ర‌భుత్వ, ప్రయివేటు ఆస్తుల‌కు న‌ష్టం కూడా జ‌రిగింది. దీంతో పోలీసులు కేసులు కూడా న‌మోదు చేశారు. ఆ విష‌యం తెలుసుకొన్న ప్ర‌భాస్‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ చాలా బాధ‌ప‌డ్డార‌ట‌. వెంట‌నే త‌మ త‌మ అభిమానుల‌కి ఫోన్లు చేసి వారించార‌ట‌. మేమంతా అన్న‌ద‌మ్ముల్లా క‌లిసి మెలిసి ఉన్న‌ప్పుడు మీరెందుకు గొడ‌వ ప‌డ‌తార‌ని ఇద్ద‌రూ కూడా అభిమానుల్ని కూల్ చేసే ప్ర‌య‌త్నం చేశార‌ని స‌మాచారం. స్వ‌యంగా క‌థానాయ‌కులు రంగంలోకి దిగ‌డంతో అభిమానులు కూడా శాంతించార‌ని తెలుస్తోంది. ప‌వ‌న్‌ క‌ళ్యాణ్ ఈ రోజునుంచి `స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌ సింగ్` కొత్త షెడ్యూల్ కోసం రంగంలోకి దిగుతున్నారు. హైద‌రాబాద్ ప‌రిస‌రాల్లో కీల‌క స‌న్నివేశాల్ని చిత్రీక‌రించ‌నున్నారు.