Begin typing your search above and press return to search.
పవన్ కళ్యాణ్ 70 లక్షల హీరో
By: Tupaki Desk | 12 April 2016 12:00 PM ISTపవన్ కళ్యాణ్ 70 కోట్ల హీరో అంటే ఓకే కానీ.. మరీ 70 లక్షల హీరో ఏంటి అంటారా..? సినిమాల్లోకి అడుగుపెట్టే ముందు పవన్ ను చూసి అతడి స్నేహితులు కొందరు ఇలాగే అన్నారట. చిరంజీవి తమ్ముడివి కాబట్టి నీ మీద ఓ యాభై లక్షలు పెట్టి సినిమా తీయొచ్చు.. అది ఓ 70 లక్షలు వసూలు చేయొచ్చు.. అదీ నీ రేంజ్ అన్నట్లు మాట్లాడారట. ఈ మాటలతో చిర్రెత్తుకొచ్చిన పవన్.. నా స్థాయి ఏంటో నువ్వెలా డిసైడ్ చేస్తారంటూ వాదనకు దిగాడట. నేను ఆ మాత్రం కూడా విలువ చేయకపోవచ్చు.. అలాగే ఏ స్థాయికైనా వెళ్లొచ్చు.. అది డిసైడ్ చెయ్యడానికి మీరెవ్వరూ అన్నాడట. ఈ రోజు ‘సర్దార్ గబ్బర్ సింగ్’ తొలి రోజే రూ.31 కోట్లు కలెక్ట్ చేసింది కదా దీనికేమంటారు అంటూ ఆ రోజు తనను ఎద్దేవా చేసిన వాళ్లను ప్రశ్నించాడు పవన్.
ఇక ‘సర్దార్ గబ్బర్ సింగ్’ను హిందీలో రిలీజ్ చేయడంపై వస్తున్న విమర్శల్ని.. అక్కడ ఈ సినిమాపై వస్తున్న నెగెటివ్ ఫీడ్ బ్యాక్ ను తేలిగ్గా తీసుకున్నాడు పవన్. మనవాళ్లకు చాలా పిరికితనం అని.. అందుకే ఏ ప్రయత్నం చేయకుండా ఊరికే ఉండిపోతారని.. తాను మన సినిమాను హిందీలో రిలీజ్ చేయడానికి ఓ ప్రయత్నం చేశానని, దీని ఫలితం తనకు దక్కకపోయినా ఆ తర్వాత ఎవరైనా అందుకోవచ్చని పవన్ అన్నాడు. రజినీకాంత్ ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఇంత ఫాలోయింగ్ సంపాదించుకున్నాడంటే అది ఊరికే వచ్చేయలేదని.. ఎన్నో సినిమాలు డబ్ చేసి విడుదల చేశాక.. చాలా ఆలస్యంగా ఆయనకు ఇక్కడ స్టార్ ఇమేజ్ వచ్చిందని పవన్ అన్నాడు. కాబట్టి తన సినిమాకు బాలీవుడ్లో ఎలాంటి రిజల్ట్ వచ్చినా తాను పట్టించుకోనని అన్నాడు పవన్. రెమ్యూనరేషన్లు.. బడ్జెట్ పెరిగిపోతున్న ప్రస్తుత తరుణంలో వేరే భాషల్లోనూ మన సినిమాలు విడుదల చేసి మార్కెట్ పెంచుకోవాల్సిన అవసరం ఉందని పవన్ చెప్పాడు.