Begin typing your search above and press return to search.

అమెరికా పర్యటనలో పవన్ తో ఎవరో తెలుసా?

By:  Tupaki Desk   |   9 Feb 2017 4:30 AM GMT
అమెరికా పర్యటనలో పవన్ తో ఎవరో తెలుసా?
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అమెరికా పర్యటన మొదలైపోయింది. ఆయన ఆల్రెడీ బోస్టన్లో అడుగుపెట్టేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు.. వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ ఫొటోలు.. వీడియోల్లో పవన్ వెంట ఆయన మిత్రుడు.. ‘కాటమరాయుడు’ నిర్మాత శరత్ మరార్ కూడా కనిపిస్తున్నారు. ఐతే చాలా మంది గమనించని విషయం ఏంటంటే.. ఈ ఫొటోల్లో పవన్ భార్య అనా లెజ్ నెవా కూడా ఉంది. అమెరికా పర్యటన కాబట్టి ఫొటోలో ఉన్నది ఎవరో అమెరికన్ లేడీ అనుకుని జనాలు పెద్దగా పట్టించుకోవడం లేదు కానీ.. కాస్త పరిశీలనగా చూస్తే కానీ అక్కడున్నది పవన్ భార్య అన్న సంగతి అర్థం కాదు.

పవన్-అనా కలిసి బయట కనిపించిన సందర్భాలు దాదాపుగా లేవనే చెప్పాలి. అనా కొన్నిసార్లు మెగా ఫ్యామిలీ ఈవెంట్లలో సింగిల్ గా కనిపించింది తప్ప పవన్ తో కలిసి కనిసి దర్శనమివ్వలేదు. హార్వర్డ్ యూనివర్శిటీలో ప్రసంగించబోతున్న ప్రత్యేక సందర్భంలో వెంట భార్య ఉంటే బాగుంటుందని భావించాడేమో. అలాగే తన భార్యకు ఈ పర్యటన ఆటవిడుపుగా కూడా ఉంటుందని పవన్ అనుకున్నాడేమో. ఏదైతేనేం.. పవన్-అనా కలిసి ఒకే ఫొటోలో కనిపించడం అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తుంది. ఈ రోజు నుంచి ఐదు రోజుల పాటు అమెరికాలోనే ఉంటాడు పవన్. హార్వర్డ్ యూనివర్శిటీ కార్యక్రమంతో పాటు మరికొన్ని ప్రోగ్రాంల్లో పాల్గొని అంతర్జాతీయ ఖ్యాతినార్జించిన వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు.. శాస్త్రవేత్తలు.. ఐటీ నిపుణుల్ని పవన్ కలవనున్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/