Begin typing your search above and press return to search.

ఒళ్లు దగ్గరపెట్టుకు చేస్తా -పవన్

By:  Tupaki Desk   |   18 March 2017 6:01 PM GMT
ఒళ్లు దగ్గరపెట్టుకు చేస్తా -పవన్
X
పవన్ కళ్యాణ్ సినిమా ఫంక్షన్ కి వస్తే సినిమాల గురించి.. రాజకీయ వేదికపై పాలిటిక్స్ గురించే మాట్లాడుతుంటాడు. కానీ కాటమరాయుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ట్రెండ్ మార్చేశాడు. ఇక్కడ స్పీచ్ మొదలుపెట్టడమే అభిమానులతో మొదలుపెట్టినా.. వారి కేకలు అరుపులు విన్న తర్వాత రాజకీయాల్లోకి వెళ్లిపోయాడు.

"ఇక్కడు అభిమానులు అందరికి క్షమాపణలు. పెద్ద ఫంక్షన్ చేద్దామని అనుకున్నా.. నేనే వద్దని అనుకున్నాను. లా అండర్ ఆర్డర్ సమస్యల్లాంటి వస్తాయి. మీ అందరి క్షేమం కోసమే చిన్న ఫంక్షన్.. అంతే తప్ప మీ మీద ప్రేమ తక్కువై కాదు" అని చెప్పిన పవన్.. ఆడిటోరియంలో అభిమానుల కేకలపై కాసేపు దృష్టి సారించాడు. కొన్ని క్షణాలు సావధానంగా ఆలోచించిన తర్వాత మళ్లీ మాట్లాడ్డం ప్రారంభించాడు పవర్ స్టార్.

"నేను ఏ పనైనా జాగ్రత్తగా చేయాలని అనుకుంటాను చేస్తాను. ఆఖరికి వీధులు ఊడ్చే పనైనా నిస్సిగ్గుగా పని చేస్తాను. ఏ పనైనా ఒళ్లు దగ్గర పెట్టుకుని చేస్తాను.. సినిమాలు కూడా అంతే. భవిష్యత్తులో మీరు ఎలాంటి బాధ్యతలు చేతిలో పెట్టినా అలాగే చేస్తాను. మీ మాటలు వినిపిస్తాయ్.. కానీ నేను వాటి గురించి ఆలోచించను. ప్రజా క్షేమం కావాలంటే అధికారం అంతిమ లక్ష్యం కాదు. జరిగిందా మంచిది.. జరక్కపోతే ఇంకా మంచిది" అన్న పవన్.. "నా బిడ్డలు ఒకటే.. మీ అందరి బిడ్డలు ఒకటే" అంటూ సెంటిమెంట్ తో అందరి గుండెలను టచ్ చేసేశాడు.

బాహుశా ఈ నిజాయితే కదా ఆయనవైపు ఎక్కువమందిని ఆకర్షితులయ్యేలా చేస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/