Begin typing your search above and press return to search.

పవన్ ఆ కమెడియన్ ని కొట్టాడా?

By:  Tupaki Desk   |   16 March 2016 10:33 AM IST
పవన్ ఆ కమెడియన్ ని కొట్టాడా?
X
సర్దార్ గబ్బర్ సింగ్ పనులు శరవేగంగా పూర్తి చేస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఒకదాని వెంట ఒకటి చొప్పున 2,3 స్పాట్స్ లో సీన్స్ తీసేస్తున్నాడు. ఈ టైంలో ఓ కమెడియన్ పై ఇరిటేషన్ వచ్చి, లాగిపెట్టి ఒకటిచ్చుకున్నాడనే టాక్ వినిపిస్తోంది. క్రమశిక్షణ లేకుండా నిర్లక్ష్యంగా ప్రవర్తించడమే ఇలా పవన్ చెంపదెబ్బ కొట్టడానికి కారణం అంటున్నారు. అంతేకాదు అప్పటికప్పుడే సెట్స్ నుంచి వెళ్లిపోవాలని ఆర్డర్ కూడా పాస్ చేసేశాడట పవన్ కళ్యాణ్.

షూటింగ్ స్పాట్ లో అందరి ముందే డైరెక్టర్ పై కుళ్లు జోకులు వేయడం, అవమానించేలా మాట్లాడ్డం లాంటివి ఈ కమెడియన్ చేస్తున్నాడట. అయితే, మొదట ఈ విషయం తెలిసినా పవన్ అంతగా పట్టించుకోలేదని అంటున్నారు. అయితే ఇతను గత 15 రోజులుగా ఇదే పనిలో ఉన్నాడని, డైరెక్టర్ పై ప్రాక్టికల్ జోక్స్ ప్లే చేయడం, ఇతరుల ముందు కావాలనే పరువు తీసేలా మాట్లాడ్డం లాంటివి చేస్తుండడంతో.. పవన్ సహనాన్ని కోల్పోయాడని తెలుస్తోంది.

దీంతో ఆగ్రహం చెందిన పవన్.. కమెడియన్ పిలిచి, లాగిపెట్టి చెంపదెబ్బ కొట్టి ఫ్యూచర్ లో ఇలాంటి రిపీట్ కాకుండా చూస్కోవాలని హెచ్చరించాడట. సర్దార్ సెట్స్ పై పవర్ స్టార్ ఇలా ఎప్పుడూ కనిపించకపోవడంతో.. మొత్తం యూనిట్ అంతా షాక్ కి గురై, స్టన్ అయిపోయారని తెలుస్తోంది. టీవీ షోల నుంచి సినిమాల స్థాయికి ఎదిగిన ఈ కమెడియన్.. ప్రస్తుతం మంచి జోరు మీదే ఉన్నాడు.