Begin typing your search above and press return to search.
చెగువేరాతో పవన్ గారాల పట్టి
By: Tupaki Desk | 7 July 2018 12:21 PM ISTతన ఐడియాలజీలో ప్రసిద్ధ విప్లవకారుడు చెగువేరా గురించి ప్రస్తావించే పవన్ కళ్యాణ్ తన జీవితంలో ఆయన ప్రభావం ఎంత ఉందొ చెప్పే ఏ అవకాశాన్ని వదులుకోరు. తాజాగా తన కూతురు పోలినా అంజనీ చేగువెరా మైనపు బొమ్మ పక్కన నిలుచుని అచ్చం విగ్రహం తరహాలో జై ధ్వానాలు చేస్తున్న స్టిల్ ను తన ట్విట్టర్ లో షేర్ చేసుకోవడం వైరల్ గా మారింది. అందులో తాను నెల్లూరు విఆర్ కాలేజీ లో ఇంటర్ మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నప్పటి నుంచి చేగువేరా గురించి సాహిత్యాన్ని చదువుతున్నానని ఏదో ఒక రూపంలో ఆయన జ్ఞాపకాలు తనను వెంటాడుతూనే ఉన్నాయని అందులో పేర్కొనడం విశేషం. పవన్ కూతురు తీసుకున్న ఈ పిక్ ఇటీవలే రష్యా వెళ్ళినప్పుడు సెయింట్ పీటర్ బర్గ్ మ్యూజియం లో తీసుకున్నది. పవన్ తో పాటు అతను ఇష్టపడే చేగువేరాను అభిమానించే ఫాన్స్ ఈ పిక్ ను మహా వైరల్ చేస్తున్నారు.
సినిమాలు మానేస్తున్నాను అని చెప్పి రాజకీయాల్లోకి జనసేన అధినేత వచ్చిన పవన్ కళ్యాణ్ ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటున్నాడు. సమాజానికి సంబందించిన పుస్తకాల ఫోటోలను పోస్ట్ చేస్తూ తన ఆలోచన ధోరణిని బయటపెడుతున్న పవన్ ఈ మధ్యే తాను బాగా చిన్నప్పుడు అన్నయ్యలతో తీసుకున్న ఫోటోను పెట్టడం కూడా హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు ఈ చేగువేరా పిక్ చూసి ముందు ముందు పవన్ రేర్ ఫొటోస్ పోస్ట్ చేయటం ఖాయంగా ఫిక్స్ అవుతున్నారు అభిమానులు. రష్యా ఎప్పుడు వెళ్ళింది ఎవరెవరు వెళ్లారు అనే వివరాలు షేర్ చేయలేదు కానీ తన పిల్లల ఫోటోలు చాలా అరుదుగా పోస్ట్ చేసే పవన్ అన్నింటిలోకి దీన్నే స్పెషల్ గా ఫీలవుతున్నారు ఫాన్స్.