Begin typing your search above and press return to search.

చరణ్ - బన్నీ లకు పవన్ థ్యాంక్స్..!

By:  Tupaki Desk   |   12 Sept 2020 2:40 PM IST
చరణ్ - బన్నీ లకు పవన్ థ్యాంక్స్..!
X
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంలోని కడపల్లి గ్రామానికి చెందిన పవన్ ఫ్యాన్స్‌ ఫ్లెక్స్ కడుతుండగా ప్రమాదవశాత్తు ముగ్గురు అభిమానులు చనిపోయారు. ఈ ప్రమాదంలో సోమ‌శేఖ‌ర్‌ - అరుణాచ‌ల‌నం - రాజేంద్ర అక్క‌డిక‌క్క‌డే మరణించగా హ‌రికృష్ణ‌ - ప‌వ‌న్‌ - సుబ్ర‌హ్మ‌ణ్యం - అరుణ్‌ తీవ్ర గాయాలపాలై చికిత్స పొందుతున్నారు. మృతి చెందిన వారికి సంతాపం ప్రకటించిన పవన్ కళ్యాణ్.. మృతి చెందిన ఒక్కొక్క కుటుంబానికి 2 ల‌క్ష‌ల రూపాయ‌ల ఆర్థిక‌సాయం అందించాల‌ని పార్టీ కార్యాల‌య సిబ్బందిని ఆదేశించారు. వీరితో పాటు చనిపోయిన ఫ్యాన్స్‌ కుటుంబాలకు అండగా నిలుస్తూ రామ్ చరణ్ ఒక్కో కుటుంబానికి రెండున్నర లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని అందజేస్తున్నట్లు ప్రకటించారు. అలానే అల్లు అర్జున్ - దిల్ రాజు - ఏఎమ్ రత్నం - మైత్రీ మూవీ మేకర్స్ వారు వారి కుటుంబాలకు 2 లక్షల ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపారు.

కాగా విధ్యుత్ ఘాతం వలన చనిపోయిన పవన్ అభిమానులకు జనసేన నాయకులు ఆర్థిక సాయాన్ని అందించారు. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ తెలియజేస్తూ.. ''చిత్తూరు జిల్లా శాంతిపురం సమీపంలోని కడపల్లి దగ్గర ఈ నెల 1వ తేదీన చోటు చేసుకున్న దుర్ఘటనలో కన్నుమూసిన జనసైనికుల కుటుంబాలకు ఇంకో మారు నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను. అలాగే ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ జనసైనికులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను'' అని ట్వీట్ చేశారు. అలానే మృతి చెందిన ఫ్యామిలీస్ కి అండగా నిలిచిన రామ్ చరణ్ - అల్లు అర్జున్ - దిల్ రాజు - ఏఎమ్ రత్నం - మైత్రి మూవీ మేకర్స్ నవీన్ మరియు రవి లకు ధన్యవాదాలు తెలిపారు పవన్. బాధిత కుటుంబాలకు మీరు అందించిన సహకారం గొప్పది.. ఇలాంటి విషాద సమయంలో మీరు చూపించిన మానవత్వం గురించి మాటల్లో చెప్పలేం అంటూ పవన్ కల్యాణ్ ట్విట్టర్ లో పేర్కొన్నారు.