Begin typing your search above and press return to search.

రాజ‌కీయాల్లో ఉంటూ పేకాట క్ల‌బ్ లు.. సిమెంట్- పాల‌ ఫ్యాక్ట‌రీలు న‌డపొచ్చా?!- ప‌వ‌న్

By:  Tupaki Desk   |   5 April 2021 6:30 AM GMT
రాజ‌కీయాల్లో ఉంటూ పేకాట క్ల‌బ్ లు.. సిమెంట్- పాల‌ ఫ్యాక్ట‌రీలు న‌డపొచ్చా?!- ప‌వ‌న్
X
రాజ‌కీయాల్లో ఉంటూ పేకాట క్ల‌బ్ లు.. సిమెంట్ ఫ్యాక్ట‌రీలు న‌డ‌పొచ్చు.. పాల ఫ్యాక్ట‌రీలు పెట్టొచ్చు.. నేను సినిమాల్లో న‌టిస్తే త‌ప్పా?!- ప‌వ‌న్ క‌ల్యాణ్‌

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ జ‌న‌సేన పార్టీని స్థాపించి జ‌న‌సేనానిగా ప్ర‌జ‌ల్లోకి వెళ్లిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న రాజ‌కీయాలు చేస్తూనే సినిమాలు చేస్తున్నారు. అయితే దీనిపై ప్ర‌త్య‌ర్థులు తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే అన్నిటికీ టోకున వ‌కీల్ సాబ్ ప్రీరిలీజ్ వేదిక‌పై ఆయ‌న ఇచ్చిన స‌మాధానం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

రాజకీయాల్లో ఉంటూ సినిమాలు ఎందుకు చేయాలని కొందరు అనవసరపు వాదనలు చేస్తున్నారు. మీరు రాజకీయాల్లో ఉంటూ సిమెంట్ ఫ్యాక్టరీలు నడుపొచ్చు... పాల ఫ్యాక్టరీలు పెట్టొచ్చు.. నేను సినిమాల్లో నటిస్తే తప్పా? అని పవన్ త‌న ప్ర‌త్య‌ర్థుల్ని అవినీతి నాయ‌కుల్ని ప్రశ్నించారు. పేకాట క్లబ్బులు నడిపే వాళ్లు ఎమ్మెల్యేలు కావొచ్చు. పైరవీలు చేసే వాళ్లు ఎమ్మెల్యేలు కావొచ్చు! అంటూ అధికార ప్ర‌తిప‌క్ష పార్టీల నాయ‌కుల‌పైనా చెణు‌కులు విసిరారు.

జీత‌భ‌త్యాల గురించి సౌక‌ర్యాల గురించి అడ్డ‌దారులు తొక్కుతార‌ని కూడా నాయ‌కుల‌ను విమ‌ర్శించారు ప‌వ‌న్. ప్ర‌ధానికి 4ల‌క్ష‌ల జీతం.. ముఖ్య‌మంత్రికి 1.5ల‌క్ష‌ల జీతం.. ఎమ్మెల్యేకు ల‌క్ష జీతం.. వీటికోసం అడ్డ‌దారులు తొక్కుతార‌ని కూడా విమ‌ర్శించారు. తాను సినిమాలు చేస్తే 1000 పైగా కుటుంబాలు బ‌తుకుతాయ‌ని.. అవినీతి చేయ‌కుండా జీవించేందుకే సినిమాలు చేస్తున్నాన‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ అన్నారు. సినిమాతో సంపాదించింది తిరిగి సినిమాల‌కే ఖ‌ర్చు చేస్తున్నామ‌ని కూడా ప‌వ‌న్ ఈ వేదిక‌పై తెలిపారు.

వ‌కీల్ సాబ్ వేదిక‌పై ప‌వ‌న్ త‌న ద‌ర్శ‌కులు.. నిర్మాత‌ల్ని ప్ర‌శంసించారు. సినిమాపై ఫ్యాషన్ తో వ‌చ్చి అంచెలంచెలుగా ఎదిగి నిర్మాత అయిన దిల్ రాజు దశాబ్ధాల పాటు ప‌రిశ్ర‌మ‌కు సేవ‌లు చేశార‌ని అలాంటి వ్య‌క్తి నిర్మాత‌గా సినిమా చేయ‌డం అదృష్ట‌మ‌ని ప‌వ‌న్ అన్నారు. దిల్ రాజు.. వేణు శ్రీ‌రామ్ లాంటి వ్య‌క్తులు ఈ రంగంలో ఎంతో శ్ర‌మించి ప్ర‌తిభ‌తో ఎదిగార‌ని అలాంటి వారితో ప‌ని చేయ‌డం ఆనందంగా ఉంద‌ని ప‌వ‌న్ ప్ర‌శంస‌లు కురిపించారు.

వేణు శ్రీరాం- హరీష్ శంకర్- సాగర్ లాంటి అభిమానులు నా దర్శకులు అయినందుకు గర్వపడుతాను. నాపై ఇష్టంతో ప్రేమతో వారు ఈ రంగానికి వ‌చ్చి సినిమాలు చేస్తున్నారు. అలాంటి వారితో వియ‌వంత‌మైన సినిమాలు చేసేందుకు ఆస్కారం ఉంటుంద‌‌ని ప‌వ‌న్ అన్నారు.