Begin typing your search above and press return to search.

పవన్ స్వీయ నిర్మాణంలో మేనల్లుడి సినిమా..?

By:  Tupaki Desk   |   4 Feb 2022 11:38 AM GMT
పవన్ స్వీయ నిర్మాణంలో మేనల్లుడి సినిమా..?
X
మెగా మామా అల్లుళ్ళు పవన్ కళ్యాణ్ - సాయి ధరమ్ తేజ్ కలిసి ఓ సినిమా చేయబోతున్నారని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇప్ప్పుడు లేటెస్టుగా 'వినోద‌య సీత‌మ్‌' అనే తమిళ రీమేక్ లో వీరిద్దరూ నటించనున్నారని టాక్ నడుస్తోంది. అయితే ఇంతలోనే ఈ సినిమా పవన్ స్వీయ నిర్మాణంలో రూపొందనుందనే మరో న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ప్రముఖ నటుడు, దర్శకుడు సముద్రఖని తెరకెక్కించిన 'వినోదయ సైతం' మూవీ ఇటీవల నేరుగా ఓటీటీలో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇందులో తంబి రామ‌స్వామి - స‌ముద్ర ఖ‌ని ప్రధాన పాత్రల్లో నటించారు. దేవుడు ప్రత్యక్షమై ఓ మనిషికి తన చావు గురించి ముందే చెప్పి.. అతని బ‌రువు బాధ్య‌త‌ల‌ను ముందుగానే తీర్చేసుకోమంటే పరిస్థితి ఏంటనే ఆసక్తికరమైన కథాంశంతో ఈ సినిమా రూపొందింది. ఇందులోని సముద్ర‌ఖ‌ని దేవుడి పాత్ర‌లో క‌నిపిస్తారు.

అయితే ఇప్పుడు 'వినోద‌య సీత‌' చిత్రాన్ని సముద్ర‌ఖ‌ని దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ - సాయి తేజ్ లతో తెలుగులోకి రీమేక్ చేయనున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇందులో పవన్ దేవుడిగా కనిపిస్తారని అంటున్నారు. అంతేకాదు ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌ పై నిర్మించనున్నారనే మరో రూమర్ చక్కర్లు కొడుతోంది.

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థతో కలిసి పవన్ కళ్యాణ్ తన సొంత బ్యానర్ లో సినిమాలు చేయాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పుడు తమిళ్ రీమేక్ ని బ్యాంక్ రోల్ చేస్తున్నారట. మేనల్లుడు సాయి తేజ్‌ తో కలిసి స్క్రీన్‌ షేర్ చేసుకోవడమే కాదు.. పవన్ నిర్మాతగా కూడా వ్యవహరించడానికి రెడీ అయ్యారట. మరి త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలి.

ఇకపోతే పవన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. 'భీమ్లా నాయక్' సినిమా రిలీజ్ కు రెడీ అవ్వగా.. త్వరలో 'హరి హర వీరమల్లు' మూవీ షూటింగ్ తిరిగి ప్రారంభం కానుంది. ఇదే క్రమంలో 'భవదీయుడు భగత్ సింగ్' చిత్రంతో పాటుగా సురేందర్ రెడ్డి సినిమా చేయనున్నారు. మరోవైపు 'రిప‌బ్లిక్' విడుద‌లకు ముందు రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన సాయి తేజ్.. ఇప్పుడు పూర్తిగా కోలుకున్నారు. త్వ‌ర‌లోనే బివిఎస్ఎన్ ప్ర‌సాద్ - సుకుమార్ కలిసి నిర్మించే ఓ మిస్టిక్ థ్రిల్ల‌ర్ సినిమాలో నటించనున్నారు.