Begin typing your search above and press return to search.

ఆ సినిమాకు పవన్ రెమ్యునరేషన్ ఇన్ని కోట్లా?

By:  Tupaki Desk   |   17 March 2023 8:00 PM GMT
ఆ సినిమాకు పవన్ రెమ్యునరేషన్ ఇన్ని కోట్లా?
X
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఓ వైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు రాజకీయాల్లో బిజీ బిజీగా గడుపుతున్నారు. పవన్ కల్యాణ్.. సముద్రఖని దర్శకత్వంలో వినోదాయ సీతమ్ రీమేక్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే పవన్ రెమ్యూనరేషన్పై ఇటీవల చర్చ జరుగుతుంది. స్వయంగా ఆయనే తన రెమ్యూనరేషన్ పై క్లారిటీ ఇచ్చారు. రోజుకు 2 కోట్లు తీసుకుంటున్నట్లు పొలిటికల్ పార్టీ ఈవెంట్లో తెలిపాడు.

ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహరవీమల్లు సినిమాను పవన్ పక్కన పెట్టేశారు. ఇక వినోదాయ సీతం రీమేక్ షూటింగ్లో పాల్గొంటున్నాడు. అయితే ఈ సినిమా కోసం పవన్ రోజుకు రెండు కోట్లు తీసుకుంటున్నట్లు ఇటీవల ప్రకటించారు.

సినిమా ఏంటో చెప్పకుండా... 22 రోజులకు.. రోజుకు రెండు కోట్ల రూపాయలు తీసుకుంటున్నట్లు తెలిపాడు. అయితే 22 రోజుల షూటింగ్ అంటే.. వినోదాయ సీతం కోసం పవన్ కల్యాణ్ 22 డేట్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

అయితే పవన్ రెమ్యూనరేషన్ వినోదాయ సీతం కోసమని అర్థం అవుతోంది. ఇక ఈ సినిమా షూటింగ్ లో పవన్ కాల్షీట్లు పెరిగితే దాదాపుగా పవన్ కల్యాణ్ ఈ సినిమాకు 50 కోట్లు తీసుకుంటారు. దీంతో ఆయన ఒక్క సినిమాకు 50 కోట్ల రెమ్యూనరేషన్ తీసున్నట్లు అవుతుంది. ఇక ఈ సినిమాలో తన అల్లుడు సాయి ధరమ్ తేజ్ నటిస్తున్నారు. ఇక ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఇటీవల ప్రారంభం అయ్యాయి.

వినోదాయ సీతం రీమేక్ ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. పవన్ కల్యాణ్ రెమ్యూనరేషన్ తో కలిపి ఈ సినిమాపై 80 కోట్లకు పైగా ఖర్చు చేయనున్నట్లు సమాచారం.

తక్కువ రోజుల్లోనే ఈ సినిమాను కంప్లీట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇక ఈ సినిమాను తమిళంలో తెరకెక్కించిన దర్శకుడే.. తెలుగులోనూ తెరకెక్కిస్తున్నారు. తెలుగు నెటివిటీకి తగ్గట్లు మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో పవన్ కల్యాణ్ తో శ్రీలీల ఓ ఐటెం సాంగ్ ఉంటుందని సమాచారం. ఇక ఈ సినిమాకు మాటల రచయితగా త్రివిక్రమ్ పని చేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.