Begin typing your search above and press return to search.

పవన్ రెమ్యూనరేషన్ 8 కోట్లేనా?

By:  Tupaki Desk   |   24 Dec 2017 5:11 AM GMT
పవన్ రెమ్యూనరేషన్ 8 కోట్లేనా?
X
ఒక్కో సినిమాకూ స్టార్ హీరోలు కోట్లలో తీసుకుంటున్న రోజులివి. 1995వ సంవత్సరంలో మెగాస్టార్ చిరంజీవి 1.5 కోటి తీసుకుంటే.. బిగ్గర్ థెన్ బచ్చన్ అంటూ అప్పట్లో నేషనల్ మీడియా ఆయన్ను ఆకాశానికి ఎత్తేసింది. అయితే ఇప్పుడు మాత్రం సినిమాకు ఏకంగా 20 నుండి 30 కోట్లు కూడా తీసుకుంటున్నారు మన హీరోలు. అందులో పవన్ కళ్యాణ్‌ అయితే అజ్ఞాతవాసి సినిమాకు 40 కోట్లు పుచ్చుకున్నాడని అనేక రూమర్లను విన్నాం.

అయితే ఇప్పుడు ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రచురించిన సెలబ్రిటీ 100 జాబితా ఏదైతే ఉందో.. అది మాత్రం కాస్త ఇబ్బంది పెట్టేదిగానే ఉంది. ఎందుకంటే ఆ లిస్టులో పవన్ కళ్యాణ్‌ కు 69వ స్థానం కట్టిపెడుతూ.. గత సంవత్సరం ఆగస్టు నుండి ఈ సంవత్సరం సెప్టెంబర్ వరకు ఆయన ఆధాయం 11.33 కోట్లు అని చెప్పింది ఫోర్బ్స్. నిజానికి ఈ సంవత్సర కాలంలో సర్దార్ గబ్బర్ సింగ్ మరియు కాటమరాయుడు సినిమాలను చేశాడు పవన్ కళ్యాణ్‌. ఆ రెండింటికీ సినిమాకు 20 కోట్లు పుచ్చుకున్నా కూడా.. ఆదాయపు పన్ను కట్టేశాక ఆయన దగ్గర 28 కోట్లు వుంటుంది. కాని అక్కడ చెప్పినట్లు 11 కోట్లు ఉందంటే.. రెండు సినిమాలకు 16 కోట్లు వచ్చుండాలి. అంటే పవన్ రెమ్యూనరేషన్ 8 కోట్లేనా?

గతంలో ఈ ఫోర్బ్స్ లెక్కలపై కింగ్ నాగార్జున స్పందిస్తూ.. అసలు వీరు ప్రచురించే జాబితా కరక్టు కాదని.. తను అవి తప్పుడు నెంబర్లు అని చెప్పినా వినకుండా తన ఆదాయాన్ని ఎక్కువగా ప్రచురించేశారని ఆయన అన్నారు. ఆ లెక్కన చూస్తే ఇప్పుడు పవన్ ఆధాయం లెక్క గురించి ఏమనాలో ఏంటో!!