Begin typing your search above and press return to search.

50 నిమిషాల కోసం 50 కోట్లు తీసుకున్నాడా..?

By:  Tupaki Desk   |   7 April 2021 8:30 AM GMT
50 నిమిషాల కోసం 50 కోట్లు తీసుకున్నాడా..?
X
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'వకీల్ సాబ్' సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన 'వకీల్ సాబ్' చిత్రాన్ని దిల్ రాజు - బోనీ కపూర్ కలిసి నిర్మించారు. పవన్ ని సిల్వర్ స్క్రీన్ పై చూడాలని ఆతృతగా ఎదురుచూస్తున్న అభిమానులను మరో రెండు రోజుల్లో దర్శనమివ్వనున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్‌ 9న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ తో ఈ మూవీపై అంచనాలు పెంచేసాడు. దీనికి తగ్గట్టే భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా 'పింక్' చిత్రానికి రీమేక్ గా తెరకెక్కినప్పటికీ పవన్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని పలు మార్పులు చేర్పులు చేశారు. సెన్సార్ బోర్డు వారు 155 నిమిషాల నిడివితో 'వకీల్ సాబ్' కు 'యూ/ఏ' సర్టిఫికెట్ జారీ చేశారు.

అయితే 'వకీల్ సాబ్' చిత్రంలో పవన్ కళ్యాణ్ పాత్ర నిడివిపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఇందులో పవన్ స్క్రీన్ స్పేస్ సుమారు 50 నిమిషాలు ఉంటుందట. వాస్తవానికి హిందీ 'పింక్' సినిమాలో అమితాబ్ బచ్చన్ పాత్ర నిడివి చాలా తక్కువ ఉంటుంది. కేవలం కోర్టు సీన్స్ కే ఆయన పరిమితం అవుతారు. కానీ తెలుగు స్క్రిప్ట్ లో చాలా చేంజెస్ చేశారు. ఫ్లాష్ బ్యాక్ యాడ్ చేయడంతో పాటుగా సాంగ్స్ - ఫైట్స్ వంటి కమర్షియల్ హంగులు జోడించారు. ఈ నేపథ్యంలో 2 గంటల 35 నిమిషాల సినిమాలో పవన్ పాత్ర 50 నిమిషాల పాటు కనిపిస్తుందని అంటున్నారు. మిగతా స్క్రీన్ టైంలో కీలక పాత్రలు పోషించిన నివేదా థామస్ - అంజలి - అనన్య కనిపించనున్నారు. ఇకపోతే 'వకీల్ సాబ్' మూవీ కోసం పవన్ దాదాపు 50 కోట్ల వరకు తీసుకున్నాడని ప్రచారం జరుగుతోంది. ఇదే కనుక నిజమైతే పవన్ 50 నిమిషాల కోసం 50 కోట్లు తీసుకున్నారని అనుకోవాలి.