Begin typing your search above and press return to search.

పవన్ కళ్యాణ్ రికార్డ్.. ప్రభాస్ సినిమాకే సాధ్యం?

By:  Tupaki Desk   |   11 Oct 2022 10:30 AM GMT
పవన్ కళ్యాణ్ రికార్డ్.. ప్రభాస్ సినిమాకే సాధ్యం?
X
ఇటీవల కాలంలో స్టార్ హీరోల సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి ఓపెనింగ్స్ అందుకుంటున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కేవలం కొత్త సినిమాలు మాత్రమే కాకుండా అప్పుడెప్పుడో విడుదలైన పాత సినిమాలు యావరేజ్ సినిమాలో ఫ్లాప్ సినిమాలు కూడా ఇప్పుడు రిలీజ్ అయితే అదే హడావిడితో కనిపిస్తూ ఉండడం విశేషం. ఫాన్స్ అయితే మళ్లీ విడుదలవుతున్న సినిమాలను ఎంతో హ్యాపీగా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.

ఇక ఇప్పుడు రీ రిలీజ్ రికార్డులు కూడా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. తప్పకుండా రాబోయే రోజుల్లో మరిన్ని పాత సినిమాలు లేటెస్ట్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఇక నైజం ఏరియాలో కూడా మన స్టార్ హీరోలకు మంచి మార్కెట్ ఉంది. ఎప్పటికప్పుడు ఈ రికార్డులు కూడా బ్రేక్ అవుతున్నాయి. ఇటీవల విడుదలైన పోకిరి సినిమా కేవలం నైజాం ఏరియా లోనే 69 లక్షల గ్రాస్ అందుకుంది.

ఇక ఆ తర్వాత విడుదలైన జల్సా సినిమా 1.29 కోట్లతో ఆ రికార్డును బ్రేక్ చేసి నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఇక రీసెంట్గా వచ్చిన చెన్నకేశవరెడ్డి సినిమా కూడా నైజం ఏరియాలో పర్వాలేదు అనే విధంగా 15 లక్షల గ్రాస్ కలెక్షన్స్ అందుకుంది.

అయితే ఇప్పుడు అందరి ఫోకస్ కూడా ప్రభాస్ సినిమాపైనే ఉంది. ప్రభాస్ కెరీర్ లో స్టైలిష్ యాక్షన్ మూవీ బిల్లా బాక్సాఫీస్ రికార్డులు తిరగేసి రేంజ్ లో అయితే అప్పట్లో సక్సెస్ కాలేదు.

కానీ ఇప్పుడు మళ్ళీ దాన్ని రిలీజ్ చేస్తే ఆడియన్స్ ఎగబడి చూసే అవకాశం అయితే ఉంది. ఇక ప్రభాస్ పుట్టినరోజు అక్టోబర్ 23 కాబట్టి బిల్లా కు సంబంధించిన 4కే ప్రింట్ లు అయితే రెడీ అవుతున్నాయి. ఇక ఆ టైంలో సినిమాలు విడుదల చేస్తే నైజాం ఏరియాలో జల్సా రికార్డును బ్రేక్ చేయవచ్చు అని అనిపిస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమవుతుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.