Begin typing your search above and press return to search.

పవన్- చెర్రీల ఆత్మీయ కథ ఇదే

By:  Tupaki Desk   |   8 Jun 2016 3:00 PM IST
పవన్- చెర్రీల ఆత్మీయ కథ ఇదే
X
ఈ మధ్య మెగా ఫ్యాన్స్- పవర్ స్టార్ ఫ్యాన్స్ మధ్య వివాదం ఓ రేంజ్ కి వెళ్లిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్ 'చెప్పను బ్రదర్' సంఘటన తర్వాత ఇది పీక్స్ కి వెళ్లిపోయింది. అయితే.. ఎక్కడా రామ్ చరణ్ మాత్రం ఈ వివాదంపై నోరు మెదపలేదు. సోదరి నీహారిక సినిమా ఒక మనసు ఆడియో రిలీజ్ సమయంలో కూడా.. చాలా ఎలర్ట్ గా కనిపించాడు. అయితే.. మెగాస్టార్ - పవర్ స్టార్ ల మధ్య విబేధాలు ఇంకా ఉన్నాయని చాలామంది అనుకుంటూ ఉంటారు.

రీసెంట్ గా ఏ స్టార్ వాల్యూ లేకుండా త్రివిక్రమ్ అ..ఆ.. చిత్రాన్ని సూపర్ సక్సెస్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మాటల మాంత్రికుడు నెక్ట్స్ పిక్చర్ ఎవరితో చేస్తాడనే టాక్ బాగా నడుస్తోంది. అయితే.. త్రివిక్రమ్ మాత్రం పవన్ తో చేయాలనే ఉద్దేశ్యంలో ఉన్నాడట. అందుకు తగ్గట్లుగానే రెండు స్టోరీలను తన స్నేహితుడైన పవర్ స్టార్ కి వినిపించాడని తెలుస్తోంది. ఈ రెండు కథలు పవన్ కి విపరీతంగా నచ్చేసినా.. విన్న తర్వాత పవన్ చెప్పిన మాట విని త్రివిక్రమ్ కూడా షాక్ తిన్నాడట.

'ఈ రెండు స్టోరీలను అన్నయ్య కొడుకు రామ్ చరణ్ కి చెప్పండి. ఏదో ఒకటి తను ఎంచుకుంటే.. నేనే నిర్మాతగా ఆ సినిమా చేస్తా. అది పూర్తయిన తర్వాత.. రెండో స్టోరీలో నేనే నటిస్తా. వరుసగా చేసేద్దాం' అని పవన్ సూచించాడని తెలుస్తోంది. చెర్రీకి బెస్ట్ ఆప్షన్ ఇవ్వాలన్న ఆలోచనలోనే.. వీళ్ల అనుబంధం - ఆత్మీయత అర్ధమవుతుంది. అయితే.. ఈ వెర్షన్ బయటకొచ్చాక త్రివిక్రమ్ చేయబోయే తర్వాతి రెండు సినిమాలు మెగా హీరోలతోనే అని తెలిసి ఫ్యాన్స్ మాత్రం తెగ ఎగ్జయిట్ అయిపోతున్నారు.