Begin typing your search above and press return to search.
పవన్ మల్టీస్టారర్ ను రెడీ చేస్తున్న సితార
By: Tupaki Desk | 23 Oct 2020 3:40 PM ISTమలయాళ హిట్ మూవీ అయ్యప్పన్ కోషియమ్ ను తెలుగులో రీమేక్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా దాదాపు ఏడాది కాలంగా వార్తలు వస్తున్నాయి. ఆ సినిమా రీమేక్ రైట్స్ ను ఫ్యాన్సీ రేటుకు సితార ఎంటర్ టైన్ మెంట్స్ వారు తీసుకున్నారు. అప్పటి నుండి పలువురు హీరోలతో సితార వారు చర్చలు జరుపుతూ వచ్చారు. ఒక వైపు స్క్రిప్ట్ వర్క్ చేయిస్తూనే మరో వైపు హీరోల కోసం చర్చలు జరిపారు. బాలకృష్ణ.. రవితేజలతో పాటు పలువురు స్టార్ హీరోలతో సీనియర్ హీరోలతో చర్చలు జరిపారు. చివరకు పవన్ వద్దకు వచ్చి ఈ రీమేక్ ఆగింది.
త్రివిక్రమ్ మరియు కొందరు రచయితలు స్క్రిప్ట్ కు పదును పెట్టడంతో పాటు పవన్ ను ఒప్పించే ప్రయత్నం చేసి సఫలం అయ్యారనే వార్తలు వస్తున్నాయి. పవన్ తో పాటు నటించేందుకు రానా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అంటూ ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాకు సాగర్ దర్శకత్వం వహించబోతున్నట్లుగా కూడా మీడియా సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. కేవలం నెల రోజుల్లోనే ఈ సినిమాను పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారట. పవన్ మరియు రానాలు అధికారికంగా ఓకే చెప్తే దసరాకు ఈ రీమేక్ కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
పవన్ ఇప్పటికే చాలా సినిమాలు కమిట్ అయ్యి ఉన్నాడు. వాటితో పాటు ఈ సినిమా కూడా పట్టాలెక్కే అవకాశం ఉంది. ఈమద్య కాలంలో పలు మలయాళ సినిమాలు తెలుగులో రీమేక్ అవుతున్నాయి. అదే దారిలో ఈ సినిమా కూడా రీమేక్ కు రెడీ అయ్యింది. అతి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని మీడియా సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది.