Begin typing your search above and press return to search.

పవన్‌.. రానాల మూవీ షూటింగ్ షెడ్యూల్‌ అప్‌ డేట్స్‌

By:  Tupaki Desk   |   23 Dec 2020 11:00 AM IST
పవన్‌.. రానాల మూవీ షూటింగ్ షెడ్యూల్‌ అప్‌ డేట్స్‌
X
పవన్‌ కళ్యాణ్‌ మరియు రానాలు హీరోలుగా మలయాళ సూపర్‌ హిట్‌ మూవీ అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌ సినిమాను సితార ఎంటర్ టైన్‌ మెంట్స్ వారు సాగర్ చంద్ర దర్శకత్వంలో రీమేక్ చేయబోతున్నారు. ఇప్పటికే పూజా కార్యక్రమాలు జరిగాయి. స్క్రిప్ట్‌ వర్క్‌ దాదాపుగా పూర్తి అయ్యింది. పక్కాగా ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ పూర్తి అయ్యింది. ఈ సినిమా షూటింగ్‌ ను వచ్చే నెల 2 నుండి ప్రారంభించే అవకాశం ఉందని అంటున్నారు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను మార్చి నెల వరకు పూర్తి చేసేలా ప్లాన్‌ చేస్తున్నారట.

ఈ రీమేక్ కోసం పవన్‌ నుండి 50 రోజులు.. రానా నుండి 30 రోజుల డేట్లను దర్శకుడు తీసుకున్నాడనే వార్తలు వస్తున్నాయి. ఎక్కువగా ఔట్ డోర్‌ షూటింగ్‌ లేకుండా సింపుల్‌ గా స్థానికంగానే చిత్రీకరణ ముగించబోతున్నాడు. కథానుసారం ఇదో సింపుల్‌ స్క్రీన్‌ ప్లే ను కలిగి ఉంటుంది. కనుక భారీ యాక్షన్‌ ఎపిసోడ్‌ లు కాని మరెన్నో కమర్షియల్‌ ఎపిసోడ్స్‌ కాని ఉండవు. కనుక సింపుల్ గా ఈ సినిమాను రెండు నెలల గ్యాప్‌ లోనే పూర్తి చేయాలని ముందు నుండి భావిస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే దర్శకుడు ప్లాన్‌ చేసుకున్నాడు.

తక్కువ రోజులే డేట్లు అడగడం వల్ల ఇతర సినిమాల కంటే మొదటగా ఈ సినిమాను పూర్తి చేయాలయి పవన్‌ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. పవన్‌ కు ఈ సినిమా కోసం నిర్మాతలు 50 కోట్లకు పైగా పారితోషికంగా ఇస్తున్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ సినిమాను ఏప్రిల్‌ లేదా మే నెలల్లోనే విడుదల చేసే అవకాశం లేకపోలేదు. వకీల్‌ సాబ్ మరియు ఈ రీమేక్‌ లు కొన్ని వారాల తేడాతోనే ప్రేక్షకుల ముందుకు వస్తాయంటున్నారు. రానాతో పవన్‌ కాంబో ఎలా ఉంటుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.